No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Tue, May 7 2024 1:30 AM

No He

బనశంకరి: కన్నడనాట రెండో విడత లోక్‌సభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఉత్తర కన్నడ, శివమొగ్గ సహా బళ్లారి, కొప్పళ, రాయచూరు, బీదర్‌, బాగల్‌కోట, బెళగావి తదితర ఉత్తర కర్ణాటకలో మిగిలిపోయిన 14 సీట్లలో ఓటర్లు మంగళవారం తీర్పు ఇవ్వబోతున్నారు. సోమవారం మధ్యాహ్నం నుంచి జిల్లా కేంద్రాల నుంచి ఉద్యోగులు ఎన్నికల సామగ్రి తీసుకుని పోలింగ్‌ కేంద్రాలకు బయల్దేరారు. 14 స్థానాల్లో కాంగ్రెస్‌, అలాగే బీజేపీ– జేడీఎస్‌ కూటమి, ఇతర పార్టీల నుంచి 227 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 28,269 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు సహా ప్రముఖ నేతలు పోటీలో ఉన్నారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలలో భారీ బందోబస్తు ఏర్పాటు కానుంది.

పోలింగ్‌ పెరిగేనా

రాష్ట్రంలో మొత్తం 28 సీట్లకు రెండు విడతల్లో ఎన్నికలను నిర్ణయించడం తెలిసిందే. గత నెల 26న బెంగళూరు సహా దక్షిణాది జిల్లాల్లో పోలింగ్‌ ముగిసింది. మొత్తం 70 శాతం ఓటింగ్‌ నమోదైంది. ఈసారి ఉత్తర కర్ణాటకలో ఎంత జరుగుతుందోనని ఉత్కంఠ ఏర్పడింది. రెండో విడతతో కన్నడనాట ఎన్నికల సమరం సమాప్తమవుతుంది.

40 వేల మందితో భద్రత

రెండో దశ పోలింగ్‌కు 40 వేలకు పైగా పోలీస్‌, కేంద్ర బలగాలను నియమించినట్లు శాంతి భద్రతల అదనపు డీజీపీ హితేంద్ర తెలిపారు. స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కూడా బందోబస్తులో ఉంటాయని చెప్పారు. బెంగళూరు, మైసూరుతో పాటు ఇతర జిల్లాలనుంచి తరలించినట్లు చెప్పారు. ఇక ఎన్నికల ప్రక్రియ పరిశీలనకు విదేశీ ప్రతినిధులు కూడా వచ్చారు.

శివమొగ్గలో త్రిముఖ పోరు

శివమొగ్గ: రాష్ట్రంలో శివమొగ్గ లోక్‌సభ స్థానం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇక్కడ పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బంది సామగ్రితో బయల్దేరారు. ప్రతి ఒక్క పోలింగ్‌ కేంద్రానికి రెండు ఈవీఎంలు, వివి పాట్లు, కంట్రోలింగ్‌ యూనిట్‌, సిరా బుడ్డీలు, అట్ట పెట్టెలను సిబ్బందికి ఇచ్చారు. అధికారులు, సిబ్బంది, భద్రతా సిబ్బంది చేరుకున్నారు. మహిళల కోసం 40 సఖి పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. జిల్లాలో 325 సున్నితమైన పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. బీజేపీ ఎంపీ, అభ్యర్థి రాఘవేంద్ర, రెబెల్‌గా మాజీ మంత్రి ఈశ్వరప్ప, కాంగ్రెస్‌ నుంచి నటుడు శివరాజ్‌కుమార్‌ సతీమణి గీత పోటీ పడుతున్నారు. దీంతో రాఘవేంద్రకు ఎదురుగాలి తప్పదని వినిపిస్తోంది.

No Headline
1/2

No Headline

No Headline
2/2

No Headline

Advertisement

తప్పక చదవండి

Advertisement