పంట నష్టపరిహారం కోసం ధర్నా | Sakshi
Sakshi News home page

పంట నష్టపరిహారం కోసం ధర్నా

Published Tue, May 7 2024 4:10 AM

పంట న

కోలారు: ముంగారు వడగండ్ల వానలకు జిల్లాలో పలుచోట్ల పంటనష్టం జరిగి రైతులు నష్టపోయిన వాణిజ్య పంటలకు ప్రతి ఎకరాకు రూ.2 లక్షల పరిహారం అందించాలని రైతు సంఘం పదాధికారులు సోమవారం ముళబాగిలు తాలూకా వడ్డహళ్లి ఏపీఎంసీ ప్రాంగణం వద్ద జిల్లా ఇంచార్జి మంత్రి భైరతి సురేష్‌ ఫోటోతో ధర్నా చేశారు. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె నారాయణగౌడ మాట్లాడుతూ జిల్లా రైతులు అతివృష్టి, అనావృష్టి ఇలా ఏదో విధంగా ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ముంగారు వడగండ్ల వానలతో బొప్పాయి రైతులు, అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వాణిజ్య పంటలను నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరాకు తలా రూ.2 లక్షల పరిహారం, కోళ్ల ఫారంలో కోళ్లు చనిపోయి నష్టపోయిన కోళ్ల ఫారం రైతులకు తలా రూ.5 లక్షల పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. జిల్లా అధ్యక్షుడు ఈకంబళ్లి మంజునాథ్‌, తాలూకా అధ్యక్షుడు యలువళ్లి ప్రభాకర్‌, బంగారి మంజు, సునీల్‌కుమార్‌, నాగేష్‌, భాస్కర్‌, విజయపాల్‌ తదితరులు ఉన్నారు.

పంట నష్టపరిహారం కోసం ధర్నా
1/2

పంట నష్టపరిహారం కోసం ధర్నా

పంట నష్టపరిహారం కోసం ధర్నా
2/2

పంట నష్టపరిహారం కోసం ధర్నా

Advertisement

తప్పక చదవండి

Advertisement