పండగ తర్వాత కమ్మేసిన విషాదం
●ఈతకు వెళ్లి ముగ్గురు జల సమాధి
గౌరిబిదనూరు: దీపావళి పండుగను ఆనందంగా జరుపుకున్న మూడు కుటుంబాలను అనుకోని రీతిలో విషాదం కమ్మేసింది. చిన్నాయన, పెద్ద నాయన కుటుంబాలకు చెందిన పిల్లలు ఎంతో సంబరంగా పటాసులు కాల్చిన మరుసటి రోజు సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు, యువతి జల సమాధి అయ్యారు. ఈ విషాద ఘటన చిక్కబళ్లాపురం తాలూకా కమ్మతహళ్లిలో జరిగింది. రామనగరానికి చెందిన రమ్య(24), చందాపురానికి చెందిన అభిలాష్(21), శ్రీనివాసపురానికి చెందిన రంజిత్(27)లు దీపావళి పండుగ కోసం కమ్మతహళ్లికి వచ్చారు. దీపావళి మరుసటి రోజ గ్రామ సమీపంలోని చెరువు వద్దకు ఈతకు వెళ్లారు. కొత్త ప్రదేశం కావడం, నీటి లోతు తెలియకపోవడంతో నీటి మధ్యలోకి వెళ్లిన సమయంలో ఒడ్డుకు రాలేక నీట మునిగారు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో పేరేసంద్రం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి గాలింపు చేపట్టి మృతదేహాలను జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎస్పీ కుశల్‌చౌక్స్, ఏఎస్పీ ఖాశీం, డీఎస్పీ శివకుమార్ ఘటన స్థలాన్ని పరిశీలించారు.
అభిలాష్, రంజిత్(ఫైల్)
Comments
Please login to add a commentAdd a comment