కాలగర్భంలోకి మరో చిత్రమందిరం
మైసూరు : ప్రేక్షకుల ఈలలు, కేరింతలతో హోరెత్తిన చిత్రమందిరాలు మూగబోతున్నాయి. దశాబ్దాలుగా ప్రజలకు వినోదాన్ని పంచి కాలగర్భంలోకి జారుకుంటున్నాయి. తాజాగా సాంస్కృతిక నగరంగా పేరు పొందిన మైసూరులో సరస్వతీపురంలో ఉన్న సరస్వతి చిత్ర మందిరాన్ని నేలమట్టం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో కూల్చివేసిన సినిమా థియేటర్ల సంఖ్య 10కి చేరింది. మహమ్మారి కరోనా అనంతరం థియేటర్లకు ప్రేక్షకులనుంచి ఆదరణ కొరవడింది. దీనికితోడు మాల్స్, మల్టీపెక్స్‌లు వెలుస్తుండటంతో థియేటర్ల వైపు వచ్చేవారు కరవయ్యారు. దీంతో కలెక్షన్లు లేక థియేటర్ల నిర్వహణ యజమానులకు భారంగా మారింది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక యజమానులు థియేటర్లను కూల్చివేసి షాపింగ్ కాంప్లెక్స్‌లుగా మారుస్తున్నారు. ఇప్పటికే బీఎస్ రోడ్డులోని రణజిత్, హర్షా రోడ్డులో ఉన్న అపేరా, మండిమెహల్లాలోని శాలిమార్, శ్రీనాగరాజ్, రత్న, గోకుల, గణేశ, చామరాజ డబుల్ రోడ్డులోని లక్ష్మీచిత్ర, శాంతలా థియేటర్ కాలగర్భంలో కలిసిపోయాయి. ఆ కోవలోనే సరస్వతి చిత్రమందిరాన్ని కూడా యాజమాన్యం తొలగించేందుకు సన్నాహాలు చేస్తోంది.
సరస్వతి థియేటర్ కూల్చివేతకు సన్నాహాలు
Comments
Please login to add a commentAdd a comment