మైసూరు: మైసూరులో ముడా ఇళ్ల స్థలాల వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చి సీఎం సిద్దరామయ్య కుటుంబానికి ఊపిరాడకుండా చేస్తున్న సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణపై ఇక్కడి దేవరాజ పోలీసు స్టేషన్‌లో బుధవారం ఎఫ్‌ఐఆర్ నమోదైంది. మంగళవారం కాంగ్రెస్ నేత ఎం.లక్ష్మణ తదితరులు అతనిపై ఠాణాలో ఫిర్యాదు చేశారు. సీఎం సిద్దరామయ్య భార్య పార్వతి ముడా నుంచి స్థలాలను పొందిన క్రయపత్రం, స్టాంప్ డ్యూటీ చెల్లింపు పేపర్లను స్నేహమయి కృష్ణ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడని, తద్వారా సమాజంలో శాంతికి భంగం కలిగించారంటూ, సీఎం సిద్దరామయ్య కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేశాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకున్నారు. దీనిపై స్నేహమయి కృష్ణ స్పందిస్తూ తాను చేసిన అన్ని ఆరోపణలకు సాక్ష్యాలున్నాయన్నారు. ఇలాంటి ఫిర్యాదులకు భయపడేది లేదన్నారు. తప్పుడు ఫిర్యాదు ఇచ్చిన లక్ష్మణ్‌కు శిక్ష పడుతుందన్నారు. ముడా కేసులో సీఎం భార్య పార్వతి, ప్రత్యేక తహసీల్దార్‌లను విచారణ చేస్తే వాస్తవాలు బయట పడతాయన్నారు.
మైసూరు కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment