ఆక్రమణలతో ఫుట్‌పాత్‌ల కనుమరుగు
రాయచూరు రూరల్: నగరంలో ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు పెరిగిపోయాయి. దీంతో పాదచారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆక్రమణలు పెరిగిపోతున్న నగర పాలక సంస్థ, పోలీసులు మౌనంగా ఉన్నారు. నగరంలో అంబేడ్కర్ సర్కిల్ నుండి రైల్వే స్టేషన్–బస్టాండ్, నగర సభ, తహసీల్దార్, విద్యాశాఖాదికారి కార్యాలయం, జైలు రహదారి, ఏక్ మీనార్, సూపర్ మార్కెట్, తీన్ కందిల్, షరాఫ్ బజార్, నేతాజీ నగర్, పటేల్ రహదారి, ఆర్టీఓ సర్కిల్, జహీరాబాద్, హరిహర రోడ్, చంద్ర మౌళేశ్వర సర్కిల్ వంటి ప్రాంతాల్లో చిన్న దుకాణాలు ఫుట్‌పాత్‌లను ఆక్రమించేశాయి.
దీంతో పాదచారులు రోడ్డు అటువైపు వెళ్లడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికై న నగరసభ అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
పాదచారుల ఇబ్బందులు
Comments
Please login to add a commentAdd a comment