ఘరానా కూతురు, భార్య | - | Sakshi
Sakshi News home page

ఘరానా కూతురు, భార్య

Published Sat, Nov 23 2024 12:20 PM | Last Updated on Sat, Nov 23 2024 12:55 PM

-

ప్రియునితో కలిసి తండ్రి హత్య

ముళబాగిలులో ఆస్తి కోసం ఘాతుకం

కోలారు: ఆస్తి కోసం కూతురు, తన ప్రియుడు, కన్న తల్లితో కలిసి తండ్రినే కడతేర్చిన కథ జిల్లాలోని ముళబాగిలులో బయటపడింది. చివరకు అందరూ ముళబాగిలు రూరల్‌ పోలీసులకు అతిథులయ్యారు. కూతురు శైలజ, తల్లి సుధ, ప్రియుడు సురేష్‌లు నిందితులు. కేసు వివరాలు... 

గత 20 సంవత్సరాల క్రితం కేజీఎఫ్‌ తాలూకా గన్నేరహళ్లి సోమశేఖర్‌ అనే వ్యక్తితో ముళబాగిలుకు చెందిన సుధతో వివాహమైంది. నాలుగేళ్ల కిందట విడిపోయి సుధ ముళబాగిలు పట్టణంలో బాడుగ ఇంట్లో నివాసం ఉంటోంది. సుధకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక కొడుకు ఉన్నారు. మొదటి కుమార్తె శైలజాను తాయలూరుకు చెందిన గడ్డ చిన్నేనహళ్లి శశికుమార్‌కు ఇచ్చి ఆరేళ్ల కిందట పెళ్లి చేసింది. అయితే శైలజ భర్తతో గొడవ పడి విడిపోయి తల్లి వద్దకు వచ్చేసింది. ఈ క్రమంలో శైలజకు సురేష్‌ అనే వ్యక్తితో అనైతిక బంధం ఏర్పడింది.

ఆస్తి దక్కాలంటే..
తండ్రికి కొంత ఆస్తి ఉండగా, అది దక్కాలంటే అతనిని హతమార్చాలని తల్లీకూతురు, సురేష్‌తో కలిసి కుట్రలు పన్నారు. ప్లాన్‌ ప్రకారం ఈ నెల 6వ తేదీన సురేష్‌తో తండ్రికి ఫోన్‌ చేసి ముళబాగిలుకు పిలిపించారు. ఓ బార్‌లో బాగా తాగించి సురేష్‌ అతనిని ఖాద్రిపుర దగ్గర పొలం వద్దకు తీసుకు వెళ్లాడు. అక్కడ సోమశేఖర్‌ను కత్తితో పొడిచి హత్య చేసి పక్కనే ఉన్న బావిలోకి విసిరేసి వెళ్లాడు.

బావిలో శవం పత్తా
సోమశేఖర్‌ కనిపించకపోవడంతో సంబంధీకులు బేతమంగల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ముళబాగిలు రూరల్‌ పోలీసులు కూడా గాలింపు చేపట్టారు. బావిలో ఓ శవం తేలగా, వెలికి తీసి కేజీఎఫ్‌ గన్నేరహళ్లి సోమశేఖర్‌గా గుర్తించారు. అనంతరం పోలీసుల తనిఖీలో హత్య సంగతి వెలుగులోకి వచ్చి సోమశేఖర్‌ భార్య సుధ, కూతురు శైలజ, ఆమె ప్రియుడు ఖాద్రిపుర సురేష్‌లను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement