దొడ్డబళ్లాపురం: ఉత్తర కన్నడ జిల్లా ముండగోడు తాలూకాలో మంకీపాక్స్ విజృంభిస్తుండడంతో వసతి పాఠశాలలకు మూడు రోజులపాటు సెలవులు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ కే లక్ష్మిప్రియ ఆదేశాలు జారీ చేశారు. ముండగోడలోని ఇందిరాగాంధీ వసతి పాఠశాలలో 125 మంది విద్యార్థుల్లో మంకీ పాక్స్ లక్షణాలు ఉన్నట్లు తేలింది. దీంతో కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రోగం బారినపడ్డ విద్యార్థులకు ముండగోడు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. తాలూకా ఆరోగ్యాధికారి డాక్టర్ భరత్ ఇందిరాగాంధీ వసతి పాఠశాల, చుట్టుపక్కల పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు రక్త పరీక్షలు నిర్వహించారు. మొదట 25మంది విద్యార్థులకు ఈ రోగం సోకగా కొద్ది రోజుల్లోనే 125 మందికి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. రోగం వచ్చిన విద్యార్థుల నుండి దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు.
నకిలీ ఎఫ్‌ఆర్‌తో రూ.1.7కోట్లు టోపీ
దొడ్డబళ్లాపురం: సీసీబీ పోలీసులమని బెదిరించిన సైబర్‌కేటుగాళ్లు ఒక వ్యక్తి వద్ద రూ.1.7 కోట్లు దోచుకున్నారు. ఈ ఘటన మంగళూరులో చోటుచేసుకుంది. ఈనెల 11న మంగళూరుకు చెందిన వ్యక్తికి కాల్ చేసిన కేటుగాళ్లు... మీ మొబైల్ నంబర్‌తో మరో మొబైల్ నంబర్ రిజిస్టర్ అయ్యిందని, ఆ నంబర్ ముంబైలోని అంధేరిలో అనేక నేరాల్లో కీలకంగా మారిందని బెదిరించారు. తక్షణం అంధేరి పోలీస్‌స్టేషన్‌కు రావాలని బెదిరించారు. వాట్సాప్‌లో బోగస్ ఎఫ్‌ఐఆర్ కాఫీలు పంపించారు. బెదిరిపోయిన బాధితుడు ఐదు పర్యాయాలు రూ.1.7 కోట్లు ఆర్‌టీజీఎస్ ద్వారా నిందితుల ఖాతాకు పంపించాడు. అనంతరం తాను మోసపోయానని తెలుసుకున్న బాధితుడు మంగళూరు సీఈఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment