కప్పతగుడ్డకు గనుల శోకం! | - | Sakshi
Sakshi News home page

కప్పతగుడ్డకు గనుల శోకం!

Published Sat, Nov 23 2024 1:20 AM | Last Updated on Sat, Nov 23 2024 1:20 AM

కప్పత

కప్పతగుడ్డకు గనుల శోకం!

హుబ్లీ: జీవవైవిధ్యానికి నెలవైన గదగ్‌ జిల్లా కప్పతగుడ్డ పరిరక్షణ కోసం మళ్లీ పోరాటం ప్రారంభమైంది. అపారమైన పచ్చదనం, వన్యమృగాలతో ప్రకృతి అందాలతో కప్పతగుడ్డ లేదా కప్పతగిరి ప్రజల మదిని ఆకర్షిస్తోంది. చిక్కమగళూరు, కొడగు జిల్లాలో మాదిరిగా పచ్చని పర్వతాలు అబ్బురపరుస్తాయి. నిత్యం పెద్దసంఖ్యలో పర్యాటకులు వచ్చి కొండల్లో విహరించి, ప్రాచీన ఆలయాలను సందర్శిస్తారు. వందలాది అపురూపమైన వనమూలికల చెట్లు, మొక్కలకు ఈ కొండలు నిలయం. కానీ విలువైన లోహాలు కూడా ఉండడం కప్పతగిరి పాలిట శాపంగా మారింది. ఈ కొండల్లో మైనింగ్‌కు సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. పలుచోట్ల గనుల తవ్వకాలు ప్రతిపాదనలు ఉన్నాయి.

ప్రజాసంఘాల కన్నెర్ర

ఈ నేపథ్యంలో కప్పతగిరి జోలికి వెళ్లరాదని బెళగావి ప్రాంతీయ కమిషనర్‌ కార్యాలయం ఎదుట గురువారం వివిధ రైతు, పర్యావరణ, ప్రకృతి సంఘాలు ఆందోళన చేపట్టాయి. నందివేరి శివకుమార్‌ స్వామి నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనలో ఉద్యమకారులు, రక్షించండి..రక్షించండి కప్పతగుడ్డ, మాదే మాదే కప్పతగుడ్డ మాదే అని పెద్దఎత్తున నినాదాలు చేసి రాష్ట్ర ప్రభుత్వ తీరు పై మండిపడ్డారు.

పర్యావరణానికి చేదోడు

పచ్చని అడవులు, గుట్టలు, ఎర్ర మట్టి దిబ్బలతో పాటు పచ్చిక మైదానాలున్నాయి. ఈ కప్పత కొండలు 80 వేల ఎకరాలతో కూడుకొని ముండరిగి, గదగ, సిరహట్టి తాలూకాలలో వ్యాపించాయి. ఇక్కడి మంచి వాతావరణం ఉత్తర కర్ణాకటలో 15 జిల్లాల వాతావరణ సమతుల్యతను కాపాడుతోందని పేరుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కప్పతకొండలో మైనింగ్‌ చేయడానికి అనుమతి ఇచ్చిందని తెలిసింది. బెళగావి డివిజనల్‌ కమిషర్‌ నేతృత్వంలో సమావేశం జరిపి తక్షణమే మైనింగ్‌ ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని ఆందోళన కారులు డిమాండ్‌ చేశారు.

గదగ్‌ జిల్లాలో రమణీయ ప్రకృతికి నిలయం

ఖనిజ తవ్వకాలకు ప్రతిపాదనలు

ప్రజా సంఘాల ఆగ్రహం

ఉద్యమం తప్పదు

తవ్వకాలే జరిపితే ఈ కొండ రక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన ఉద్యమం చేపడుతామని ప్రముఖ ఆందోళనకారుడు శివకుమార్‌ స్వామీజీ తెలిపారు. ఎట్టి పరిస్థితిల్లోనూ మైనింగ్‌కు అవకాశం ఇవ్వరాదన్నారు. ఇప్పటికే బళ్లారి, సండూరు కొండలు కోల్పోయామన్న బాధ వేధిస్తోందన్నారు. కప్పతగుడ్డలో అన్యాయం జరగడానికి ఎట్టి పరిస్థితిలో అంగీకరించమన్నారు. 7 కోట్ల కన్నడిగుల ఈ కొండ వరం అని రాష్ట్ర ప్రజల ఆకాంక్షను తిరస్కరిస్తు పాలన చేయడం ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. గత పోరాటాలకు ప్రభుత్వాలు దిగివచ్చి ఈ కొండను వన్యజీవుల కేంద్రంగా ప్రకటించాయని, ఇప్పుడు పూర్తిగా రక్షిత అటవీ ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యామకారుడు రుద్రణ్ణ గులగుళి మాట్లాడుతూ ఢిల్లీలో పూర్తిగా విష పూరిత వాతావరణం నెలకొంది. ఇటువంటి పచ్చని చెట్లను నరికివేయడమే కారణమని అన్నారు. ఆసియాఖండంలోనే పరిశుద్ధమైన ఆక్సిజన్‌, చెట్లకు కప్పతగుడ్డ నెలవైందన్నారు. మైనింగ్‌ని వ్యతిరేకిస్తూ బెళగావి సువర్ణ సౌధలో జరిగే అసెంబ్లీ సమావేశాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా శంకర్‌ కుంబి, సరస్వతి పూజార, కేహెచ్‌.నాయక ఆర్‌జీ లింనెట్‌ డిసిల్వి, స్వప్న, ప్రమిళ జక్కనవర, తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
కప్పతగుడ్డకు గనుల శోకం! 1
1/2

కప్పతగుడ్డకు గనుల శోకం!

కప్పతగుడ్డకు గనుల శోకం! 2
2/2

కప్పతగుడ్డకు గనుల శోకం!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement