ప్రభుత్వ ఉద్యోగుల ఎన్నికలలో జోక్యం ఉండదు
కోలారు: ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఎన్నికలలో తాము జోక్యం చేసుకోమని అందరు కలిసి అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్ ఉద్యోగులకు సలహా ఇచ్చారు. సహకార రత్న అవార్డు అందుకున్న ఎమ్మెల్యేను శనివారం ఆయన నివాసంలో ప్రభుత్వ ఉద్యోగుల కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఉద్యోగులు అందరు ఐకమత్యంగా సంఘటితంగా ఉండి అధ్యక్షుడిని, పదాధికారులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఉత్తమమన్నారు. జిల్లా కేంద్రంలో ఉద్యోగుల భవనం, గురుభవనం నిర్మాణానికి సంబంధించి తన సహకారం ఉంటుందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు సక్రమంగా అందించడానికి కృషి చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల హితవును కాపాడుతూ వారి సమస్యలను పరిష్కరించడానికి సదా తాను సిద్దంగా ఉంటానన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సురేష్‌బాబు మాట్లాడుతూ... ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో ఎలాంటి గ్రూపులు లేవన్నారు. ఈ సందర్భంగా సంఘం మాజీ అధ్యక్షుడు కెబి అశోక్, కోరగండనహళ్లి నారాయణస్వామి, ఉపాధ్యక్షుడు పురుషోత్తం తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment