● కాంగ్రెస్‌పై అశోక్ ధ్వజం
శివాజీనగర: మూడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విచ్చలవిడిగా డబ్బు పంచి గెలిచింది. ప్రజలు కూడా అభివృద్ధి పనులు జరగవని భావించి కాంగ్రెస్‌కు ఓటు వేశారని బీజేపీ పక్ష నేత ఆర్.అశోక్ అన్నారు. ఫలితాల గురించి ఆయన బెంగళూరులో మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన తీర్పుకు శిరసావహిస్తాను. శిగ్గావి, చెన్నపట్టణలో ఆఖరిలో అభ్యర్థులను తీర్మానించాం, ఇది కలిసిరాలేదు. సండూరులో దీటైన పోటీ ఇచ్చాం. నిఖిల్ కుమారస్వామి రెండుసార్లు ఓడిపోయారని సానుభూతి ఉండేది, ఈసారి గెలుస్తారని అనుకున్నాం. ఆ ఊహలు ఫలించలేదు. ఇది సీఎం సిద్దరామయ్య గాని, డీసీఎం డీకే శివకుమార్ గెలుపు కానీ కాదు. ఈ మూడు చోట్లా కాంగ్రెస్ విచ్చలవిడిగా నగదు పంచింది.అధికారులు, కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారు. బీజేపీ–జేడీఎస్ కార్యకర్తలు అధైర్య పడాల్సిన పనిలేదు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మనదే విజయం అని అన్నారు. కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడింది, ఇవి సాధారణ ఫలితాలే, ఇందు చమత్కారం ఏమీ లేదన్నారు. ఏది ఏమైనా ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment