● ఓ కేసులో 10, మరో కేసులో 3.7 ఏళ్ల శిక్ష
హుబ్లీ: జిల్లాలో రెండు వేర్వేరు కేసులకు సంబంధించి రెండో అదనపు జిల్లా సెక్షన్ కోర్టు, పోక్సో ప్రత్యేక సెషన్స్ కోర్టు ఈ తీర్పును వెల్లడించింది. వివరాలు.. మైనర్ బాలిక, తన సొంత అక్క కుమార్తైపె నిరంతరంగా లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి సదరు కోర్టు న్యాయమూర్తి 10 ఏళ్ల కఠిన కారగారంతో 6 నెలల సాధారణ జైల్లు శిక్ష విధించారు. హుబ్లీ కేశ్వాపుర అపార్ట్మెంట్లోని ఓ ఇంటిలో 2021 సెప్టెంబర్ 8న నిందితుడు 16 ఏళ్ల తన అక్క కుమార్తె నిద్ర పోతుండగా ఒత్తిడి చేసి లైంగిక దౌర్జన్యాన్ని పాల్పడ్డాడు. ఆ బాలిక మూడు నెలల గర్భవతి అయిన తర్వాత తల్లి ఫిర్యాదు చేసింది. కేశ్వాపుర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టి చార్జ్‌షీట్ సమర్పించారు. కేసు విచారణ జరిపిన న్యాయమూర్తి సీ.రాజ్‌కుమార్ నిందితుడికి పైమేరకు శిక్ష విధించినట్లు ప్రభుత్వ న్యాయవాది శైల అంగడి తెలిపారు. మరో కేసులో జిల్లాలోని కుందగోళ తాలూకాలో ఓ గ్రామంలో నీరు నింపుకోవడానికి వచ్చిన మైనర్ బాలికపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడిన నిందితుడికి 3 ఏళ్ల 7 నెలల జైలు శిక్షతో పాటు రూ.12 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి రాజ్‌కుమార్ ఆదేశాలిచ్చారు. 2021 ఆగస్ట్ 10న రాత్రి నిందితుడు ఓ వ్యక్తి ఇంటి వెనుక భాగంలో నీటిని నింపుకోడానికి వెళ్లాడు. అక్కడికి వచ్చిన 12 ఏళ్ల బాలికను లాక్కెళ్లి హత్యాచారం జరిపినట్లు ధార్వాడ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన అనంతరం చార్జిషీట్ సమర్పించడంతో కోర్టు నిందితుడికి ఈ మేరకు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment