ఉద్యమించిన పంచమసాలి
సాక్షి, బళ్లారి: బెళగావి అసెంబ్లీ వద్ద మంగళవారం ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తమ వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని పంచమశాలి స్వామీజీలు, ఆ వర్గీయులు భారీ సంఖ్యలో సువర్ణసౌధ వద్ద జాతీయ రహదారిపై ఆందోళనలు చేపట్టారు. తమను బీసీ 2ఏలో చేర్చాలని నినాదాలు చేశారు. తక్షణం సీఎం సిద్ధరామయ్య రావాలని పట్టుబట్టారు. మఠాధీశులు బసవజయ, మృత్యుంజయస్వామి పాల్గొన్నారు. వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు కోరినా పట్టించుకోలేదు, దీంతో లాఠీచార్జ్ జరపడంతో జనం కకావికలమయ్యారు.
దీనిని ఖండిస్తూ స్వామిజీలు, బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ యత్నాళ్ ధర్నా చేపట్టారు. హైవేలో వాహనాలు ఎక్కడి అక్కడే ఆగిపోయాయి.
మంత్రుల రాక
ఇంతలో మంత్రులు మహదేవప్ప, వెంకటేష్, లక్ష్మీహెబ్బాల్కర్ తదితరులు అక్కడకు వచ్చి సీఎం తరఫున మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఈనేపథ్యంలో జనం పెద్ద ఎత్తున కేకలు వేస్తూ సీఎం రావాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన శృతి మించడంతో స్వాములను, యత్నాళ్‌ను పోలీసులు అరెస్టు చేసి తరలించారు. నిరసన పరిణామాలు బాధాకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర పేర్కొన్నారు. ఆయన కూడా ఆందోళన వద్దకు వచ్చి పాల్గొన్నారు. అనేకమందిని పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు.
2ఏ రిజర్వేషన్ల కోసం బెళగావిలో
అసెంబ్లీ ముందు ధర్నా
ముఖ్యమంత్రి రావాలని పట్టు
చెదరగొట్టిన పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment