బాలింతల మృత్యుఘోష
శివాజీనగర: నవమాసాలు మోసి కాన్పు అయ్యాక ప్రాణాలు కోల్పోతున్న తల్లుల ఉదంతాలు రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్నాయి. దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు సాగుతున్నాయి. ఇలా ఉంటే గత ఐదు సంవత్సరాల్లో కర్ణాటకలో 3,364 మంది బాలింతలు చనిపోయినట్లు సీఎం కార్యాలయం ప్రకటించింది. 2019–20 నుంచి 2024–25 వరకు రాష్ట్రంలో ఈ మేరకు బాలింతలు మరణించారు. బెళగావి జిల్లాలోనే సుమారు 300కు పైగా బాలింతలు అకాల మరణం చెందారని ఆరోపణలు వచ్చాయి. బీజేపీ పక్ష నేత ఆర్.అశోక్, రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర ఇటీవల బళ్లారిలోనూ బాలింతల కుటుంబాలను పరామర్శించారు. ఆరోగ్యమంత్రి దినేశ్ గుండూరావు కూడా వచ్చి ఓదార్చారు. ఈ నేపథ్యంలో గత ఐదేళ్లలో పరిస్థితి ఏమిటి అనేది చెప్పేందుకు సర్కారు ఈ సమాచారాన్ని విడుదల చేసింది.
ఏ ఏడాది ఎంతమంది?
2019–20లో రాష్ట్రంలో 662 మంది, 2020–21లో 714 మంది, 2021–22లో 595 మంది, 2022–23లో 527 మంది, 2023–24లో 518 మంది, 2024–25లో నవంబర్ ఆఖరి వరకు 348 మంది బాలింతలు మరణించారని ఇందులో పేర్కొన్నారు. ఫలితంగా వేలాది మంది శిశువులు తల్లి ప్రేమకు దూరమయ్యారు. మరణాలకు కారణాలను మాత్రం వెల్లడించలేదు.
ఐదేళ్లలో 3,364 మంది మృతి
తల్లి ప్రేమకు పసిగుడ్లు దూరం
Comments
Please login to add a commentAdd a comment