లంచగొండ్లు గజగజ
యశవంతపుర: రాష్ట్రంలో మరోసారి లోకాయుక్త పంజా విసిరింది. ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలను పీడిస్తూ సొమ్ము చేసుకునే అక్రమార్కులకు వణుకు పుట్టించింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టారనే ఆరోపణలతో తొమ్మిది మంది ప్రభుత్వ అధికారులపై లోకాయుక్త పోలీసులు మంగళవార ఉదయం దాడి చేశారు. పెద్దమొత్తంలో నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నగర, రూరల్, కలబురగి, రాయచూరు, గదగ, కొప్పళ, చిత్రదుర్గలో దాడులు జరిగాయి.
ఎక్కడెక్కడ.. ఎవరెవరిపై
బెస్కాం ఇంజినీర్ లోకేశ్ బాబు, రెవెన్యూ శాఖ ఇన్స్‌పెక్టర్ సురేశ్‌బాబు, బీబీఎంపీ యలహంక ఆదాయ ఇన్స్‌పెక్టర్ కృష్ణప్ప, బెంగళూరు రూరల్ ఆరోగ్యాధికారి ఎంసీ సునీల్‌కుమార్, చెన్నపట్టణ పోలీసు శిక్షణ పాఠశాల డిఎస్‌పి నంజుడయ్య, కలబురగి మహానగర పాలికె ఉప కమిషనర్ రామప్ప, రాయచూరు అబ్కారీ సీఐ రమేశ్, చిత్రదుర్గ సహయక అటవీ సంరక్షణాధికారి సురేశ్, గదగ్ ఎస్‌డిఎ లక్ష్మణ్ కర్ణి ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు జరిగాయి.
బెంగళూరులో ఐదుచోట్ల దాడులు సాగాయి. చిత్రదుర్గ జిల్లా చెళ్లకెరెలో అటవీ అధికారి సురేశ్ నివాసంలో అధిక మొత్తంలో ఆస్తిపత్రాలు దొరికాయి. వారి బ్యాంకు ఖాతాలు, లాకర్లను ఇంకా తనిఖీ చేయాల్సి ఉంది.
9 మంది అధికారులపై
లోకాయుక్త దాడులు
Comments
Please login to add a commentAdd a comment