బనశంకరి: ఎస్‌ఎం.కృష్ణ పార్థివ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో స్వగ్రామమైన మండ్య జిల్లా సోమనహళ్లిలో బుధవారం మద్యాహ్నం 3 గంటలకు జరుపుతామని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. సోమనహళ్లిలో అంత్యక్రియల ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. బుధవారం ఉదయం 8 గంటల తరువాత ప్రత్యేక వాహనంలో సోమనహళ్లికి తరలిస్తామని, మార్గమధ్యలో కెంగేరి, బిడది, రామనగర, చెన్నపట్టణ ఒక్కో చోట ఐదు నిమిషాలు ప్రజల కోసం నిలుపుతామని తెలిపారు. ఒక్కలిగ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలను పూర్తి చేస్తామన్నారు. సీఎం సిద్దరామయ్య, మంత్రులు పాల్గొంటారని, బుధవారం రాష్ట్రమంతటా ప్రభుత్వ సెలవు అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment