కన్నకొడుకునే అమ్మేసింది
● రామనగరలో ఓ మహిళ నిర్వాకం
బనశంకరి: డబ్బు ఆశలో పడిన ఓ తల్లి.. పేగు తెంచుకుని పుట్టిన పసికందును విక్రయించిన ఘటన రామనగరలో చోటుచేసుకుంది. వివరాలు... రామనగర యారబ్‌నగర నివాసి సద్దాంపాషా, నస్రీన్‌తాజ్‌కు 6 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి కవలు పిల్లలతో పాటు మొత్తం 4 పిల్లలున్నారు. కూలి పనులతో జీవించేవారు. నెల కిందట మగబిడ్డ పుట్టాడు. అప్పులు తీర్చడానికి బిడ్డను విక్రయించాలని నస్రీన్‌తాజ్, భర్తను ఒత్తిడి చేయగా, అతడు తిరస్కరించాడు. ఈ నెల 5వ తేదీన భర్త కూలి పనులకు వెళ్లగా, నస్రీన్‌తాజ్ , స్థానికులు అస్లాం, ఫాహిమాతో కలిసి బెంగళూరు నివాసి తర్నమ్ సుల్తాన్ అనే మహిళకు మగబిడ్డను రూ.1.5 లక్షలకు విక్రయించింది. భర్త ఇంటికి వచ్చి చూడగా వ్యవహారం బయటపడింది. భార్యను నిలయదీయడంతో పోట్లాట జరిగి సద్దాంపాషా తలకు గాయమైంది. ఆసుపత్రిలో చికిత్స పొంది 7వ తేదీ రామనగర టౌన్ పోలీస్‌స్టేషన్‌లో భార్యపై ఫిర్యాదు చేశాడు. వారు విచారణ జరిపి పసికందును కాపాడారు. తల్లితో పాటు నలుగురిని మంగళవారం అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment