కోలారు: చొక్కహళ్లి చిన్మయ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సిలంబమ్ పోటీలలో కొప్పళ బాల, బాలికల జట్లు చాంపియన్‌లుగా నిలిచి ట్రోఫీలను కైవసం చేసుకున్నాయి. జిల్లాలో మొదటి సారిగా నిర్వహించిన ఈ పోటీల్లో బెంగళూరు ఉత్తర, దక్షిణ, ధారవాడ, మైసూరు, బీదర్, దక్షిణ కన్నడ, బెళగావి, కొప్పళ, బాల బాలికల జట్లు పాల్గొన్నాయి. 8 జిల్లాల నుంచి తలా 8 మంది ప్రకారం 120 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. అన్ని పోటీల్లో కొప్పళ బాల, బాలికల జట్లు విజయం సాధించాయి.
Comments
Please login to add a commentAdd a comment