సంప్రదాయ వృత్తులను మరువరాదు
హొసపేటె: సంప్రదాయ వృత్తులను నిర్వహిస్తున్న సంఘాల్లో అంబిగర సంఘం ఒకటని, సంప్రదాయ వృత్తులను మరవరాదని హంపీ కన్నడ విశ్వవిద్యాలయం పరిశోధకుడు బసప్ప తెలిపారు. శుక్రవారం హంపీ కన్నడ విశ్వవిద్యాలయంలోని కన్నడ భాషా అధ్యయన విభాగంలో జరిగిన 276వ ఆన్‌లైన్ వారపు ప్రసంగ కార్యక్రమంలో అంబిగర కమ్యూనిటి కెరీరీ అనే అంశంపై ఆయన మాట్లాడారు. తుంగభద్ర నది పరిసరాల్లోని విజయనగర పర్యావరణంపై దృష్టి సారించి వివిధ కారణాలతో సమాజంలో వలసలు, వృత్తులు కోల్పోవడం, వృత్తుల ఆధునీకరణ జరుగుతున్న నేపథ్యంలో భాషా సాంస్కృతిక స్థితిగతులను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంబిగర సంఘం అనేక ప్రత్యామ్నాయ పేర్లతో పిలవబడుతోందన్నారు. ముఖ్యంగా నదులు, సరస్సులు, ప్రవాహాలు, సముద్రాల ఒడ్డున నివసిస్తున్నారు. ప్రధానంగా నీటి సంబంధిత వృత్తులు, బోటింగ్, పడవలు, వలల తయారీ, చేపలు పట్టడం మొదలైనవితో గంగేకుల, గంగా సంగక, గంగామతస్త, గంగపుత్ర, గౌరీమాతస్త తదితర పేర్లతో కర్ణాటక అంతటా పిలుస్తారని వివరించారు. కన్నడ భాషా విభాగాధిపతి డాక్టర్ మహదేవయ్య, ప్రజ్వల్, శ్రీదేవి, నిర్వాహకులు చౌడప్ప, అంబిక, శిల్ప తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment