రైతు రుణాల లబ్ధి పొందండి
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక జిల్లాల్లో రైతులు రుణాల లబ్ధి పొందాలని కలబుర్గి జెడ్పీ సీఈఓ భన్వర్ సింగ్ మీనా సూచించారు. శుక్రవారం జెడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులనుద్దేశించి మాట్లాడారు. వ్యవసాయ, ఉద్యానవనాల పంటల విస్తీర్ణం పెంచడానికి శాఖాధికారులు ముందుకు రావాలన్నారు. పెండింగ్‌లోని పశు సంవర్ధక శాఖ, మత్య్స శాఖల రుణాలు వెంటనే రైతులకు మంజూరు చేయాలని బ్యాంక్ అధికారులను ఆదేశించారు. మహిళల కోసం స్వ సహాయ గుంపులకు రుణాలు మంజూరు చేయాలన్నారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, సురక్ష బీమా పథకం, పంటల బీమా పథకాల గురించి రైతులకు ప్రచారం చేపట్టాలన్నారు. సమావేశంలో ఆర్‌బీఐ సభ్యుడు బబుల్, నాబార్డ్ బ్యాంక్ మేనేజర్ సంతోష్ కుమార్‌లున్నారు.
Comments
Please login to add a commentAdd a comment