హుబ్లీ: ఎమ్మెల్సీ సీటీ రవి మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌పై చేసిన వ్యాఖ్యలపై ఎటువంటి రికార్డులు లేవని, సీటీ రవి నిందించినట్లుగా ఆడియో, వీడియో సాక్ష్యాలు లభించలేదని విధాన పరిషత్ స్పీకర్ బసవరాజ్ హొరట్టి తెలిపారు. శుక్రవారం ఆయన హుబ్లీలో మీడియాతో మాట్లాడారు. అంబేడ్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన చర్చలో కాంగ్రెస్ సభ్యులు గందరగోళం సృష్టించారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సభ్యులు ప్రత్యారోపణలు చేయడంతో సమావేశాలు వాయిదా వేశానన్నారు. ఆ తర్వాత పరిషత్‌లో మైక్ ఆడియో, వీడియాలను బంద్ చేశారన్నారు. ఈ సమయంలోనే లక్ష్మీ హెబ్బాళ్కర్ వద్దకు వచ్చి తనను నిందించారన్నారని తెలిపారు. అలాగే సభ్యులు ఉమా శ్రీ, నాగరాజ్ యాదవ్, యతీంద్ర సిద్దరామయ్య నిందించినట్లుగా కూడా వినిపించాయన్నారు. మరో వైపు సీటీ రవి అరెస్ట్ విషయాన్ని తన దృష్టికి తీసుకురాలేదన్నారు. సువర్ణ సౌధ బయట సాయంత్రం 6 గంటల తర్వాత అరెస్ట్ ప్రక్రియ జరిగిందని, ఈ అన్ని విషయాలను విచారించి సోమవారం నివేదిక సమర్పిస్తానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment