రాయచూరు రూరల్: జిల్లాలో గర్భిణులు, బాలింతలు, శిశు మరణాల నియంత్రణకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జెడ్పీ సీఈఓ రాహుల్ తుకారాం పాండే సూచించారు. శుక్రవారం సిరవార సీడీపీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఆశా, అంగన్‌వాడీ కేంద్రాల కార్యకర్తలు ప్రభుత్వం నుంచి లభించే పథకాలను అందించాలన్నారు. రక్తహీనత, అపౌష్టికత వంటి వాటితో మరణిస్తున్న అంశాన్ని గమనించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో లభించే పెసలు, గుడ్డు, పాలు, వేరుశనగలు, రవ్వల వంటి ఆహార పదార్థాలను పంపిణీ చేయాలన్నారు. సమావేశంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి నవీన్ కుమార్, కార్యనిర్వహణాధికారి శశిధర్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment