అనుచిత వ్యాఖ్యలు హేయం
సాక్షి,బళ్లారి: కేంద్ర హోం మంత్రి, బీజేపీ జాతీయ నాయకుడు అమిత్‌షా పార్లమెంటులో అంబేడ్కర్‌కు అవమానం కలిగించేలా మాట్లాడటం హేయమైన చర్య అని, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, ఆయన్ను కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు మిన్నంటాయి. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, దళిత సంఘర్షణ సమితి(డీఎస్‌ఎస్) ఆధ్వర్యంలో వేర్వేరుగా ఆందోళన చేపట్టి అమిత్‌షాపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలో డీసీసీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్, కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు ముండ్రిగి నాగరాజు తదితరులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖలు చేయడం సరికాదన్నారు. టీ అమ్మిన వ్యక్తి దేశ ప్రధానమంత్రి అయ్యారంటే అది అంబేడ్కర్ చలువేనని అన్నారు. అలాంటి మహానుభావుడినే అవమానిస్తున్నారన్నారు. తక్షణం అమిత్‌షా తన పదవీకి రాజీనామా చేయాలని,లేదా ఆయన్ను మంత్రి పదవీ నుంచి తొలిగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు మారెణ్ణ, కల్లుకంబ పంపాపతి, దళిత సంఘర్షణ సమితి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అమిత్ షా రాజీనామా చేయాలి
రాయచూరు రూరల్: లోక్‌సభలో అంబేడ్కర్‌ను అవమానించే విధంగా ప్రసంగించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని చలువాది మహిళ మహాసభ సభ్యులు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన అధ్యక్షురాలు ఈరమ్మ మాట్లాడారు. నేడు అంబేడ్కర్ అనే పదం ఫ్యాషన్‌గా మారిందని పేర్కొనడాన్ని ఖండించారు. ఇలాంటి పద జాలాల వాడకం వల్ల దేశంలో శాంతికి భంగం కలిగించినట్లు అవుతుందన్నారు. హోం మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని కోరుతు అదనపు జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు. అదే మాదిరిగా బీఎస్పీ, భీమ్ ఆర్మీ సంఘాల ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులు ఆందోళనలు జరిపారు.
సీటీ రవి దిష్టిబొమ్మ దహనం
హుబ్లీ: కేశ్వాపుర బసవేశ్వర విగ్రహ సర్కిల్‌లో మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ అభిమానుల సంఘం, వీరశైవ లింగాయత సమాజం, ఉణకల్ బ్లాక్ కాంగ్రెస్ సమితి కార్యకర్తల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ సీటీ రవి దిష్టిబొమ్మకు చెప్పుల హారం వేసి దహనం చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పంచమశాలి సమాజం యువ అధ్యక్షుడు వీరేష్ హుండి మాట్లాడుతూ లక్ష్మీ హెబ్బాళ్కర్‌ను తామంతా ఆధునిక రాణి చెన్నమ్మ అని పిలుస్తామని, అలాంటి ఆమైపె సీటీ రవి రాజ్యాంగ వ్యతిరేక పదాలతో నిందించడం మహిళా వ్యతిరేక సంస్కృతికి నిదర్శనం అన్నారు. ఆయన్ను తక్షణమే ఎమ్మెల్సీ సభ్యత్వం నుంచి తొలగించాలన్నారు. అభిమానుల సంఘం అధ్యక్షుడు సునీల్ మఠపతి మాట్లాడుతూ సీటీ రవి చేసిన అసభ్యమైన నిందలు, సమస్త సీ్త్రలోకానికి చేసిన అవమానమని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల ప్రముఖులు కళావతి దత్తవాడ, ఆరిఫ్ భద్రాపుర, గీతా పాటిల్, ప్రేమా జాధవ్ తదితరులు పాల్గొన్నారు.
అమిత్‌షా మాటలు ఖండిస్తూ ఆందోళన
అంబేడ్కర్‌కు అవమానం దేశద్రోహ చర్య
డీఎస్‌ఎస్, కాంగ్రెస్ నేతల మండిపాటు
ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి
Comments
Please login to add a commentAdd a comment