సీ్త్రలకూ సమాన హక్కులు అవసరం
రాయచూరు రూరల్: సదృఢ సమాజ నిర్మాణం కోసం పురుషులతో పాటు సీ్త్రలకు కూడా సమాన హక్కులు అవసరమని నబార్డ్ బ్యాంక్ మేనేజర్ కళావతి పేర్కొన్నారు. శుక్రవారం సేవా కళాశాలలో మహిళా ఉపాధ్యాయుుులను సన్మానించి మాట్లాడారు. మహిళలు హక్కులు, విధులు, సమానత్వం, విద్య, సామాజిక, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు వీలుంటుందన్నారు. మహిళల స్వేచ్ఛకు హద్దులుండాలన్నారు. సమావేశంలో కళాశాల పాలక మండలి సదానంద ప్రభు, జిల్లా పరిశ్రమల కేంద్రం అధికారి రాయణ్ణ, రాజేష్, జగదీష్ గుప్త, అనిత, మహాజన్‌లున్నారు.
22 నుంచి గణిత శిక్షణ తరగతులు
హొసపేటె: సైన్స్, కామర్స్ కళాశాలలో ఈనెల 22 నుంచి జనవరి 14 వరకు 25 రోజుల పాటు గణిత సబ్జెక్టుపై ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు కళాశాల యాజమాన్య మండలి కార్యదర్శి, గణిత శాస్త్ర అధ్యాపకులు లేపాక్షి ఎస్. జవళి తెలిపారు. నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ కళాశాలలో చదివిన వందలాది మంది విద్యార్థులు దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారన్నారు. నైపుణ్యం కలిగిన విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. విద్యార్థులకు 100 శాతం మంచి బోధనను అందించడానికి కృషి చేస్తామన్నారు. గత 23 ఏళ్లుగా పీయూసీ విద్యార్థులకు ఉచిత బోధనను అందిస్తున్నామని, ప్రిపరేటరీ శిక్షణను అందిస్తున్నామని, దీనిని విజయనగర జిల్లా విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ధార్వాడ సీనియర్ గణిత అధ్యాపకులు శివానంద ఎం. పాటిల్ పాల్గొన్నారు.
దురలవాట్లకు
దూరంగా ఉండాలి
హొసపేటె: విద్యార్థులు దురలవాట్లకు దూరంగా ఉండాలని గుడేకోటె పీఎస్‌ఐ సుబ్రహ్మణ్యం అన్నారు. ఆయన శుక్రవారం విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా గుడేకోటె గ్రామంలోని కర్ణాటక పబ్లిక్ స్కూల్ డివిజన్, పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నేరాల నివారణపై అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రస్తుతం సైబర్ నేరాలు పెరుగుతున్నాయన్నారు. అయినా దొంగలను త్వరగా పట్టుకుంటున్నామన్నారు. సైబర్ దొంగలను కనుగొనడం కష్టం, అందువల్ల ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏఎస్సై బాబా ఫకృద్దీన్, సిబ్బంది ఎన్.గురుస్వామి, ఉపాధ్యాయులు హైదర్ శివనాయక, గోపాల నాయక్, పునీత్ పాల్గొన్నారు.
డిమాండ్లు తీర్చాలని ధర్నా
హొసపేటె: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని పరిశ్రమల్లో పని చేస్తున్న లక్షలాది మంది సంఘటిత, అసంఘటిత కార్మికుల డిమాండ్ల సాధన కోసం సీపీటీయూ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. వ్యవస్థీకృత, అసంఘటిత రంగంలో పని చేసే ఆటో, టాక్సీ, హౌస్ కీపింగ్, పోర్టర్, వీధి, ఉద్యోగ హామీ, ప్రైవేట్, మున్సిపల్, మున్సిపాలిటీ, పట్టణ పంచాయతీ, గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న ఉద్యోగులు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, అంగన్‌వాడీ, బిసిఊట, ఆశా వర్కర్ల హక్కుల పరిరక్షణతో పాటు పలు డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ డిప్యూటీ కలెక్టర్ బాలకృష్ణ ద్వారా ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించారు.
రేపు స్కాలర్‌షిప్ పరీక్షలు
హుబ్లీ: విద్యానగర సిరియూరు పార్క్‌లోని సమర్ధ సీనియర్ సైన్స్, కామర్స్ కళాశాలలో ఈ నెల 22న ఉదయం 10 గంటలకు ధార్వాడ జిల్లా 10వ తరగతి విద్యార్థులకు స్కాలర్‌షిప్‌కు ఎంపిక కోసం పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ఆ కళాశాల సైన్స్ విభాగం ముఖ్యస్థులు రాజశేఖర్ కబాడిగి తెలిపారు. శుక్రవారం స్థానిక మీడియాతో మాట్లాడిన ఆయన ఈ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించే 50 మంది విద్యార్థులు కళాశాలలో ప్రవేశ ఫీజులో రాయితీ కల్పిస్తామన్నారు. మొత్తం రూ.5 లక్షలను స్కాలర్‌షిప్‌గా అందిస్తారని వివరించారు. 10వ తరగతి సైన్స్, మ్యాథ్స్‌లలో ఒక్కో సబ్జెక్ట్‌లో 30 మార్కుల చొప్పున పరీక్ష ఉంటుందన్నారు. పరీక్షకు ఓ గంట సమయం కేటాయిస్తామన్నారు. కాగా కళాశాలలో కామర్స్ విభాగంలో విద్యార్థులకు అడ్వాన్స్ స్పోకెన్ ఇంగ్లిష్, కంప్యూటర్ శిక్షణ, సీఏ, సీఎస్, సీఎంఏ, ఇంటిగ్రేటెడ్ కోచింగ్ సౌకర్యం ఉందని ఆయన వివరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రసాద్ దేశాయి, ప్రసన్నజోషి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment