నేడు వృద్ధుల మార్గదర్శి విడుదల
హుబ్లీ: కర్ణాటక రాష్ట్ర సీనియర్ పౌరులు, విశ్రాంత ఉద్యోగుల క్షేమాభివృద్ధి సంఘం, జీవన గౌరవ అభియాన రాష్ట్ర సమితి తరఫున శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ పౌరుల జీవన గౌరవ అనే కన్నడ మార్గదర్శి పుస్తకాన్ని విడుదల చేస్తున్నట్లు ఆ సంఘం కార్యాలయం హిరియర హెజ్జె వేదిక, హోసూరు, హుబ్లీలో ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ హెచ్‌వీ సంకనూరు ప్రారంభించే ఈ కార్యక్రమంలో బీజేపీ నేత లింగరాజ పాటిల్ సదరు పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. ఈ సందర్భంగా ప్రముఖులు శివానంద అలవటిగి, వృద్దుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీఏ పాటిల్ తదితరులు పాల్గొననున్నారు.
విద్యుత్ తీగ తగిలి
వాటర్‌మ్యాన్ మృతి
హుబ్లీ: ధార్వాడ జిల్లాలోని అణ్ణిగేరి తాలూకా శాస్త్రహళ్లి గ్రామంలో వాటర్‌మ్యాన్ పంపు హౌస్‌లో కరెంట్ షాక్‌తో మృతి చెందారు. మృతుడిని ఆ గ్రామ వాటర్‌మ్యాన్ అశోక్ కాళప్ప బడిగేర(44)గా గుర్తించారు. షాగోటి రోడ్డులో పంపుహౌస్ నుంచి నీళ్లు లోడ్ చేసేటప్పుడు ఆకస్మికంగా విద్యుత్ బోర్డు నుంచి విద్యుత్ తీగలు తగలడంతో మృతి చెందాడని అణ్ణిగేరి పోలీసులు తెలిపారు. ఘటన స్థలానికి వారు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
భూకబ్జారాయుళ్లపై చర్యలేవీ?
రాయచూరు రూరల్: జిల్లాలో ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై చర్యలు చేపట్టాలని బచావో ఆందోళన సమితి నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళననుద్దేశించి జిల్లా సంచాలకుడు శ్రీనివాస కొప్పర మాట్లాడారు. నగర శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ నగరసభ, ఆర్డీఏలో నామినేటెడ్ సభ్యులను నియమించారని, సభ్యులు నగర ప్రాంతాల్లో కొండలు, గుట్టలు, పోరంబోకు, ప్రభుత్వ బంజరు భూములను స్వాధీన పర్చుకొన్నారని ఆరోపించారు. భూఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.
లోక్ అదాలత్‌లో కేసుల
సత్వర పరిష్కారం
రాయచూరు రూరల్: లోక్ అదాలత్‌లో కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు రాయచూరు జిల్లా అదనపు న్యాయమూర్తి స్వాతిక్ వెల్లడించారు. కోర్టు భవనంలో న్యాయ సేవా ప్రాధికార అద్వర్యంలో జరిగిన లోక్ అదాలత్‌లో మాట్లాడారు. జిల్లాలో 2698 కేసుల్లో 560 కేసులను రాజీ సంధానం ద్వారా పరిష్కరించారన్నారు. ప్రతి నెల తాలూకా కోర్టులో లోక్ అదాలత్ ఏర్పాటు చేశామని, కక్షిదారులు ఉచిత న్యాయ సలహాలు పొందేందుకు వీలు కల్పించామన్నారు.
నాగేంద్రకు మంత్రి పదవి కోసం పొర్లుదండాలు
బళ్లారిఅర్బన్: నగర ప్రజల ఆరాధ్య దేవత కనకదుర్గ ఆలయంలో శుక్రవారం మాజీ మంత్రి, బళ్లారి గ్రామీణ ఎమ్మెల్యే బీ.నాగేంద్ర మరో సారి మంత్రి పదవి చేపట్టాలని ఆయన అభిమానులు ఆలయ ఆవరణంలో పొర్లుదండాల సేవ చేశారు. త్వరలో నాగేంద్రకు మంత్రి పదవి దక్కేలా చూడాలని ఆయన అభిమాని ఎంజీ కనక అనే భక్తుడు అమ్మవారికి మొక్కును తీర్చాడు. కార్పొరేషన్ ఫ్లోర్‌లీడర్, సీనియర్ కార్పొరేటర్ గాదెప్ప, మారుతి, కౌషిక్, చేళ్లగుర్కి నాగరాజ్, గంగాధర్, మోకా ఇస్మాయిల్, డొనేకల్ పంచయ్య, పంచాయతీ పరమేష్, సునీల్, యాల్పి హేమరాజ్, సంగనకల్లు పవన్, వైఫై శివు, భీమ, ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment