నగర శివార్లలో యువతిపై అకృత్యం
కృష్ణరాజపురం: పరస్పరం గర్ల్‌ఫ్రెండ్‌లను మార్చుకునే స్వింగర్స్ అనే దందాను పోలీసులు ఛేదించారు.పార్టీకి రమ్మని పిలిచి స్నేహితునితో బెడ్ షేర్ చేసుకోవాలని యువతిని బలవంతం చేసి, ఆమె ఒప్పుకోకపోవడంతో స్నేహితులతో కలిసి లైంగిక దాడికి పాల్పడిన హరీష్, హేమంత్ అనే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఓ యువతిని పరిచయం చేసుకున్న హరీష్ ఆమెను మాయమాటలతో లైంగికంగా వాడుకున్నాడు. ఇటీవల వాట్సప్‌లో స్వింగర్స్ టీం అనే గ్రూప్‌ను ఏర్పాటు చేసి బెంగళూరు నగర శివార్లలో పార్టీని ఏర్పాటు చేశాడు. పార్టీకి కపుల్స్‌తో రావాలని ఆహ్వానించి, అక్కడ పరస్పరం గర్ల్‌ఫ్రెండ్‌లను మార్చుకోవాలని ప్రతిపాదించాడు. ఇలా ఒక యువతిని బలవంతం చేయబోగా ఆమె అందుకు అంగీకరించలేదు. దీంతో స్నేహితులతో కలిసి ఆమైపె అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటనతో విసుగు చెందిన ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సీసీబీ పోలీసులు ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. మొబైల్ ఫోన్ల పరిశీలనలో భయానక సత్యం బట్టబయలైంది. మొబైల్ ఫోన్‌లో పలువురు యువతుల నగ్నఫొటోలు, ఏకాంతంగా తీసుకున్న వీడియోలు లభించాయి. వాటినే చూపించి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలిసింది.
పార్టీకి పిలిచి లైంగిక దాడి, ఇద్దరి అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment