నాకు ప్రాణహాని ఉంది
శివాజీనగర: బెళగావి సువర్ణసౌధలో తనపై జరిగిన దాడి, అరెస్ట్, పోలీసుల వైఖరి అన్నింటిపై న్యాయ విచారణ చేపట్టాలని బీజేపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి సీ.టీ.రవి డిమాండ్ చేశారు. శనివారం బెంగళూరులో బీజేపీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. నాపై దాడి జరిగింది, ప్రాణహాని బెదిరింపు ఉంది. ప్రభుత్వం భద్రత కల్పించాలి. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ కలిసి ఏదో కుట్ర చేశారు. అరెస్టు సమయంలో పోలీసులు నాతో ప్రవర్తించిన విధానం సరికాదు. నా ఫోన్ కాల్ డేటా దొంగిలించారు. డీకే, మంత్రి లక్ష్మీ ఎవరితో మాట్లాడుతుండేవారు, విచారణ జరపాలి, దీంతో వాస్తవాలు బయటికి రావాలి అని అన్నారు. తనపై దాడి జరిగిందనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయని చేతులకు ఉన్న గాయాలను చూపించారు. తాను అసెంబ్లీలో మాట్లాడిన ప్రతి మాటా రికార్డయి ఉంటుంది, ఫోరెన్సిక్ రిపోర్టు తెప్పించుకోండి, పోలీసులు నాతో ఒక క్రిమినల్‌తో మాదిరిగా నడచుకొన్నారు. పోలీసులకు ఎవరో మంత్రి నుంచి తరచూ కాల్స్ వచ్చేవి అని ఆరోపించారు.
ఎఫ్‌ఐఆర్ వేయలేదు ఎందుకు?
తనపై దాడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు, అలాగే నాపై ఎఫ్‌ఐఆర్ వేయలేదు. దీనినంతటిని గమనిస్తే పెద్ద కుట్రే ఉందన్నారు. పోలీసులు తన ఫోన్ లాక్కొనేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో గొడవ అయింది. నా తలకు గాయమై రక్తం వచ్చింది. కొందరు దాడి చేసేందుకు యత్నించారు అని ఆయన ఆరోపించారు. ఆ సమయంలో మీడియా, ఎమ్మెల్యే కేశవప్రసాద్ రాకపోతే ఏమయ్యేదో తెలియదని అన్నారు. అన్నింటినీ కోర్టుకు వెల్లడించానని తెలిపారు.
డీసీఎం శివకుమార్,
మంత్రి లక్ష్మీ కుట్ర చేశారు
బీజేపీ నేత సీటీ రవి ఆరోపణలు
Comments
Please login to add a commentAdd a comment