సేవాపథం.. జగనన్న జన్మదినం
సాక్షి, బెంగళూరు: కన్నడనాట వైఎస్సార్ సీపీ పార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకను అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో పలుచోట్ల కేక్ కటింగ్‌లు, సామాజిక సేవా కార్యక్రమాలు జరిగాయి. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం పిలుపు మేరకు సేవా మార్గంలో బెంగళూరులో జన నేత వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. బెళతూరులో ఉన్న శబరి ఆశ్రయధామలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఆశ్రమంలో అనాథలకు అన్నదానం చేపట్టారు. దుప్పట్లు, సాక్సులు పంపిణీ చేశారు. ఐటీ వింగ్ తరఫున రూ. 51 వేల విరాళాన్ని శబరి ఆశ్రయధామ ప్రతినిధులకు అందజేశారు. ఈ వేడుకల్లో పెద్దసంఖ్యలో పాల్గొని తమ అభిమాన నాయకుడిపై ప్రేమను చాటారు.
కార్యకర్తలు, అభిమానులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో వైఎస్ జగన్ గత ఐదేళ్ల పాలన సాగించారని తెలిపారు. ఈ ఆరు నెలల్లోనే చంద్రబాబునాయుడు– కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందని, భవిష్యత్తులో రాబోయేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమేనని, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డేనని ధీమా వ్యక్తంచేశారు. ఈ వేడుకల్లో బెంగళూరు వైస్సార్‌సీపీ ఐటీ విభాగం సభ్యులు కుమార్ పులివెందుల, రాజశేఖర్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, పూల ప్రవీణ్, ఓబుల్ రెడ్డి, రామ్, తిరుపతి రెడ్డి, కేశవ, విజయ రాఘవ, శివ, సంతోష్, నయాబ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
బెంగళూరులో ఘనంగా వేడుకలు
తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు
Comments
Please login to add a commentAdd a comment