దొంగల పట్టివేత
● రూ.26 లక్షల సొత్తు సీజ్
శివమొగ్గ: ఇంటి చోరీ కేసులో జిల్లాలోని భద్రావతి తాలూకా హొళెహొన్నూరు స్టేషన్ పోలీసులు ముగ్గురు దొంగలను అరెస్టు చేశారు. భద్రావతి తాలూకా తిమ్లాపుర కొరచరహట్టి గ్రామ నివాసులు దర్శన్ (21), ధనంజయ (24), రవి (23) నిందితులని ఎస్పీ జీకే మిథున్ కుమార్ విలేకరులకు తెలిపారు. వారి నుంచి 50 గ్రాముల బంగారు ఆభరణాలు, 2.5 కేజీల వెండి ఆభరణాలతో కలిపి మొత్తం రూ.26.50 లక్షల విలువ చేసే బంగారు, వెండి సొత్తును స్వాధీనపరచుకున్నట్లు తెలిపారు. గత మే 11న భద్రావతి తాలూకా అరబిళచి గ్రామంలో రైతు జయణ్ణ కుటుంబం తిరుపతి దైవదర్శనానికి వెళ్లగా దొంగలు చొరబడి నగలు, నగదును ఎత్తుకెళ్లారు. ఇంకా పలుచోట్ల చిన్నా చితకా చోరీలకు పాల్పడ్డారు. డీఎస్పీ నాగరాజ్ మార్గదర్శనంలో హొలెహొన్నూరు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీపతి, సిబ్బంది గాలించి పట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment