ప్రియురాలి ఇంటిపై దాడి
సాక్షి బళ్లారి: ప్రేమించిన యువతి పెళ్లికి ఒప్పుకోలేదని ఓ పాగల్ ప్రేమికుడు ప్రేయసి ఇంటిపై దాడి చేసి పలువురిని గాయపరిచి, ఆపై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకొన్న ఘటన జిల్లాలోని సండూరు తాలూకాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. సండూరుకు చెందిన యువతి యువతి, పాపినాయకనహళ్లి చెందిన నవీన్ కాలేజీ రోజుల నుంచి ప్రేమించుకొన్నారు. ఆమె పై చదువుల కోసం వెళ్లింది, ఇక పెళ్లి చేసుకుందామని ప్రియుడు ఒత్తిడి చేశాడు. ఇప్పట్లో పెళ్లి చేసుకోనని యువతి తెగేసి చెప్పినట్లు తెలిసింది. దీంతో ఉన్మాదిగా మారిన యువకుడు శుక్రవారం రాత్రి చర్చి రోడ్డులో ఉన్న యువతి ఇంటి ముందు గొడవ చేశాడు. ఆమె సోదరుడు కార్తీక్, తల్లి, మరొకరిని కత్తితో గాయపరిచాడు. స్థానికులు బాధితులను తోరణగల్లు ఆస్పత్రికి, మెరుగైన చికిత్స కోసం జిందాల్ ఆస్పత్రికి తరలించారు. ఈఘటనపై సండూరు పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. యువతి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పారిపోయిన నవీన్ శనివారం ఉదయం రైలు పట్టాలపై శవమై కనిపించాడు. ఈ వ్యవహారం పట్టణంలో సంచలనమైంది.
ఆపై.. రైలు కింద పడి ఆత్మహత్య
సండూరులో పాగల్ ప్రేమికుడు
Comments
Please login to add a commentAdd a comment