● చిత్రలేఖన పండుగ
బనశంకరి: ఊరంత ప్రదేశంలో చిత్రలేఖనాలు కొలువై క్రయ విక్రయాలు జరిగే చిత్రసంతెకు కౌంట్‌డౌన్ మొదలైంది. ఉద్యాన నగరిలో కుమారకృప రోడ్డు చిత్రకళాపరిషత్ ఆవరణతో పాటు చుట్టుపక్కల రోడ్లులో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు చిత్రసంతె జరగనుంది. దేశం నలుమూలల నుంచి చిత్రకారులు, కళాప్రియులు పాల్గొంటారు. ఇప్పటికే చిత్రకారులు వచ్చి స్టాళ్లను సిద్ధం చేసుకున్నారు. పెయింటింగ్స్‌ను ప్రదర్శించడంతో పాటు అమ్మకానికి ఉంచుతారు. సీఎం సిద్దరామయ్య ఈ వేడుకను ప్రారంబిస్తారు. ఈసారి బాలల సంరక్షణ థీమ్‌తో నిర్వహిస్తారు. గత వారంరోజులుగా పరిషత్ విద్యార్థులు, కళాకారులు బాలల సంరక్షణను చాటేలా వేదికలను రూపొందించారు.
నేడే బెంగళూరు చిత్రసంతె
Comments
Please login to add a commentAdd a comment