అరగంటలో ఇంటికి.. అంతలోనే మృత్యుఒడికి
తుమకూరు: సంతోషంగా గోవా టూర్‌కు వెళ్లి వస్తున్నారు. ఇంకో అర్ధగంటలో ఇళ్లకు చేరుకునేలోగా మృత్యుదేవత పంజా విసిరింది. సోమవారం తెల్లవారుజామున తుమకూరు తాలూకాలోని కంబదహళ్ళి వద్ద కారును లాఢీ ఢీకొని హర్షిత్ (22) ప్రవీణ్ (23) అనే యువకులు మరణించారు. జిల్లాలో కొరటగెరె తాలూకా హొళవనహళ్లికి చెందిన ముగ్గురు యువకులు గోవాకు వెళ్లి మజా చేశారు. తిరిగి కారులో వస్తుండగా, శిర వద్ద ఒక యువకుడు దిగిపోయాడు. మిగతా ఇద్దరూ హైవేలో బయల్దేరారు, వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో కారు ముక్కలైపోయింది. ఇద్దరూ తీవ్ర గాయాలతో క్షణాల్లో ప్రాణాలు విడిచారు. పోలీసులు చేరుకుని మృతదేహాలను తుమకూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment