కేరళలో కేఎస్ ఆర్టీసీ బస్సు లోయలోకి పల్టీ
యశవంతపుర: కేరళ ఇడుక్కి జిల్లా ముండక్కయం వద్ద భక్తులతో పర్యటనకు వెళ్లిన కేఎస్ ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. లోయలో పడటంతో నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. రెమా మోహన్ (40), అరుణ్ హరి (55), సంగీత్ (45), బిందు (49) మృతులు. మరికొందరు ప్రయాణికులు గాయపడ్డారు. మృతులు కేరళవాసులే అయినా సమీపంలో కర్ణాటక ప్రాంతానికి చెందిన ఆర్టీసీ బస్సును టూర్ కోసం బాడుగకు తీసుకున్నట్లు సమాచారం. కేరళలోని మావెలిక్కెరకు చెందిన భక్తులు బాడుగకు తీసుకొని తమిళనాడులోని తంజావూరు దేవస్థానాన్ని దర్శించుకొన్నారు. ఆదివారం రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. సోమవారం ఉదయం 6:15 గంటలకు అదుపుతప్పి లోయలో పడింది. నలుగురు చనిపోగా, 30 మంది వరకూ గాయపడ్డారు. ముండకాయం, కాంజిరపల్లి ఆస్పత్రిలో చేర్చి చికిత్సలు అందిస్తున్నారు.
నలుగురు మృతి
Comments
Please login to add a commentAdd a comment