ఐఐఎం విద్యార్థి అనుమానాస్పద మృతి
బనశంకరి: బెంగళూరు ఐఐఎం విద్యార్థి అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. ఈ ఘటన మైకో లేఔట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి జరిగింది. ఐఐఎంలో గుజరాత్ కు చెందిన నిలయ్ కై లాశ్‌భాయ్ పటేల్ (24) ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇతను కాలేజీ హాస్టల్‌లో ఉంటున్నాడు. 4వ తేదీన పుట్టినరోజు స్నేహితుల గదిలో పుట్టినరోజు జరుపుకొని తన గదిలోకి వెళుతుండగా మూడో అంతస్తు పై నుంచి జారి కిందపడిపోయాడని చెబుతున్నారు. అయితే ఎవరూ గమనించలేదు. ఆదివారం ఉదయం సెక్యూరిటీ చూసి పోలీసులకు సమాచారమిచ్చారని డీసీపీ సారా ఫాతిమా తెలిపారు. సాయంత్రం మృతుని తల్లిదండ్రులు చేరుకుని మృతిపై విచారణ జరపాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment