భూమి కోసం రైతన్నల పోరుబాట
బొమ్మనహళ్లి: బెంగళూరు నగర జిల్లా పరిధిలోఉన్న ఆనేకల్ తాలూకాలోని హందేనహళ్ళి, మేడహళ్ళి గ్రామాల పరిధిలో సుమారు 700 ఎకరాల భూములను పారిశ్రామిక ప్రాంతం ఏర్పాటు కోసం కేఐఏడిబీ సేకరణ యత్నాలపై రైతులు భగ్గుమన్నారు. సోమవారం ఆనేకల్ తాలుకా భూ స్వాధీన వ్యతిరేక పోరాట సమితి నాయకులు సర్జాపుర పట్టణంలో ఉన్న ఎస్‌విఎస్ కాలేజీ మైదానంలో బృహత్ సమావేశం నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేఐఏడీబీకి తమ భూములను ఇచ్చేది లేదని చెప్పారు. ఈ సభలో స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే బీ.శివన్నతో పాటు అన్ని పార్టీల నాయకులు, వేలాది రైతులు పాల్గొన్నారు. ప్రముఖ పర్యావరణవాది ఆ.నా.యల్లప్పరెడ్డి, బెంగళూరు రూరల్ ఎంపీ డాక్టర్.సీ.ఎస్.మంజునాథ్, మాజీ కేంద్ర మంత్రి. ఎ.నారాయణస్వామి, ఎమ్మెల్సీ గోపీనాథ్‌రెడ్డి తదితరులు ముక్తకంఠంతో రైతులకు మద్దతు పలికారు.
అన్నం కూడా పుట్టదు: యల్లప్పరెడ్డి
యల్లప్పరెడ్డి మాట్లాడుతూ మనిషి ఆరోగ్యంగా జీవించాలి అంటే ఉత్తమమైన గాలి, ఆహారం, నీరు చాలా అవసరమన్నారు. కానీ పారిశ్రామిక ప్రాంతాల వల్ల ప్రజలకు అవి అందక అనారోగ్యాల పాలువుతున్నారని చెప్పారు. పరిశ్రమల పేరుతో పంటలు పండించే భూముల స్వాధీనానికి కుట్రలు చేయడం సబబు కాదన్నారు. ఆరోజుల్లో నాడ ప్రభు కెంపేగౌడ బెంగళూరు కోసం ఎంతో కృషి చేశారని, చుట్టుపక్కల సువిశాలమైన రహదారులు, పెద్ద పెద్ద చెరువులు, నీటికుంటలు, తోపులు, కొండలపైన దేవాలయాలు నిర్మించారని తెలిపారు. కానీ నేటి పాలకులు ఆయన చేసిన మంచి పనులను చెడగొడుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం బెంగళూరు లో ఉన్న భూగర్భ జలాలు మొత్తం కలుషితమయ్యాయి. ఆనేకల్ తాలూకాలో మధుమేహం, క్యాన్సర్ రోగుల సంఖ్య పెరగడమే దీనికి ఉదాహరణ, అని హెచ్చరించారు. పంట భూముల పోతే మునుముందు ప్రజలకు తినడానికి అన్నం కూడా దొరకదని అన్నారు.
700 ఎకరాల సేకరణ పై ధ్వజం
Comments
Please login to add a commentAdd a comment