ఉద్యోగార్థులకు దళారుల వల
శివాజీనగర: ఉద్యోగ నియామక పరీక్షల్లో పాస్ చేయిస్తానని అభ్యర్థులను నమ్మించి డబ్బు వసూలు చేస్తున్న వ్యక్తిని బెంగళూరు ఉప్పారపేట పోలీసులు అరెస్ట్ చేశారు. విజయపుర జిల్లా ఇండి తాలూకాకు చెందిన సికందర్ చౌధరి (44) అరెస్టయిన వ్యక్తి. నగరంలో గాంధీనగరలో సజ్జన్ లాడ్జ్‌లో సికందర్ బస చేశాడు. కేఏఎస్, పీడీఓ, ఎస్‌ఐ తో పాటుగా వివిధ పోటీ పరీక్షలు రాసిన యువతీ యువకులకు బ్రోకర్ల ద్వారా సమాచారం పంపి పరీక్షల్లో ఉత్తీర్ణులు చేయిస్తానని నమ్మించేవాడు. జనవరి 2న లాడ్జిలో రూం చేసుకొన్నాడు. కొందరు అభ్యర్థులు భేటీ చేయడం గురించి సమాచారం అందగా స్థానిక ఉప్పారపేట పోలీసులు వెళ్లి నిందితున్ని అరెస్ట్ చేశారు. అతనిని కలిసినవారు, ఫోన్లలో మాట్లాడినవారి గురించి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇటీవల రైల్వే అధికారి..
పోటీ పరీక్షల్లో పాస్ చేయిస్తానని నమ్మించి సొమ్ములు రాబడుతున్న గోవిందరాజు అనే రైల్వే అధికారిని గత నెల 29న విజయనగర పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు మెజిస్టిక్‌లో ఉన్న సౌత్ వెస్టర్న్ రైల్వేలో చీఫ్ టికెట్ ఇన్‌ప్పెక్టర్‌గా పని చేస్తుండేవారు. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల పరీక్షలు ఇటీవల కాలంలో అనేకం జరిగాయి. దీంతో ఉద్యోగాలిప్పిస్తామని అమాయకులను నమ్మించి డబ్బు వసూలు చేసే మోసగాళ్లు పెరిగిపోయారు.
డబ్బులిస్తే గ్యారంటీ అని ప్రలోభాలు
మరో మోసగాని పట్టివేత
Comments
Please login to add a commentAdd a comment