కమిషనర్, ఉప కమిషనర్ నియామకం
రాయచూరు రూరల్: రాయచూరు నగర సభను కార్పొరేషన్‌గా ప్రకటిచండంతో ఆర్‌డీఏ కమిషనర్ మెహబూబ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా నగరసభ కమిషనర్‌గా ఉన్న గురు సిద్దయ్యను కార్పొరేషన్ ఉప కమిషనర్‌గా నియమించారు.
విద్యార్థినిపై లైంగిక దాడి
రాయచూరు రూరల్: పదో తరగతి బాలికపై యువకులు లైంగిక దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాయచూరు జిల్లా కవితాళ మండలం అమీన్‌గడ్‌కు చెందిన బాలికను అదేగ్రామానికి చెందిన 19 ఏళ్ల యువకుడు గతనెల 2వ తేదీన కారులో ఎక్కించుకొని మరో ఐదు మందితో కలిసి లైంగిక దాడికి యత్నించారని బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేష్ నాయక్ తెలిపారు.
వైభవంగా వీరభద్రేశ్వర రథోత్సవం
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా మోరబు గ్రామంలో ప్రసిద్ధ వీరభద్రేశ్వర రథోత్సవం శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. భక్తులు తేరు చక్రాలకు నీళ్లు పోసి భక్తిని చాటుకున్నారు. ఇక్కడి చిన్న వీరభద్రుడు, దొడ్డ వీరభద్రుడు ఆలయాలకు వెళ్లి దర్శనం చేసుకున్నారు. సాయంత్రం రథోత్సవం జరిగింది. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment