మరపురాని తీపి గుర్తులు
హొసపేటె: ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుండే తీపి జ్ఞాపకాలు చిన్నతనంలోనే ఉంటాయని టీబీ డ్యామ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు గడ్డం శ్రీనివాసులు, ఆర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఆదివారం కిష్కింద రిసార్ట్స్‌లో 1975లో పదో తరగతి చదివిన తెలుగు మీడియం పూర్వ విద్యార్థులు సమ్మేళనం జరిగింది. 50 సంవత్సరాల తర్వాత కలుసుకున్న పూర్వవిద్యార్థులు ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆనాటి తీపి గుర్తులను తలచుకుని సంతోషంగా గడిపారు. కార్యక్రమంలో 20 మంది దాకా పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
‘హంపీ ఉత్సవ్’ లోగోకు ఆహ్వానం
హొసపేటె: త్వరలో జరిగే హంపీ ఉత్సవ్–2025కు సంబంధించి లోగో తయారీ కోసం ఎంట్రీలు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ఎంఎస్ దివాకర్ పేర్కొన్నారు. ఉత్తమ లోగోను రూపొందించిన విజేతకు తగిన ప్రతిఫలం అందజేస్తామని ప్రకటించారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉత్సవాలకు సంబంధించి కొత్త లోగో రూపొందించాల్సి ఉంది. ఆసక్తి గల కళాకారులు జనవరి 15లోగా శ్రీసహాయ సంచాలకులు, కన్నడ, సాంస్కృతిక శాఖ, విజయనగరం జిల్లా కార్యాలయంశ్రీలో ప్రతిపాదనలు సమర్పించాలని, గడువు తర్వాత వచ్చినవి పరిగణనలోకి తీసుకోబోమని కలెక్టర్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.
మానవీయ విలువలు అలవర్చుకోవాలి
రాయచూరు రూరల్: విద్యార్థులు మానవీయ విలువలను పెంపొందించుకోవాలని ఎంపీ కుమార్‌నాయక్ పిలుపునిచ్చారు. నగరంలోని రేస్ పాఠశాలలో జరిగిన వార్షికోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరలకు చేరుకోవాలని సూచించారు. మొక్కలు నాటి నగరంలో పచ్చదనాన్ని పెంపొందించాలని, ప్లాస్టిక్ నిర్మూలనో భాగస్వాములు కావాలన్నారు.
రైతులకు అండగా ఉండాలి
రాయచూరురూరల్: రైతుల అభ్యున్నతికి బ్యాంకులు సహకారం అందించాలని ఎంపీ కుమార నాయక్ సూచించారు. శనివారం ఆయన తన కార్యాలయంలో పలు బ్యాంకు అధికారులు, నబార్డు, లీడ్ బ్యాంకర్లతో సమావేశమై మాట్లాడారు. రైతులకు అవసరమైన పంట రుణాలు సకాలంలో అందించాలన్నారు.
యువజనోత్సవాలకు
తరలిన కళాకారులు
కోలారు: దావణగెరెలో జరగనున్న రాష్ట్ర స్థాయి యువజనోత్సవాల్లో పాల్గొనడానికి ఎంపికై న జిల్లాకు చెందిన జానపద కళాకారులు ఆదివారం బయలుదేరి వెళ్లారు. జల కళ, సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు వెంకటాచలపతి నేతృత్వంలో జానపద కళాకారులు నాదప్రియ వినుత టీకల్, బి వి సౌధామిని, నారాయణస్వామి, మూర్తి, గజేంద్ర, రాజ్‌కుమార్, రమ్య, సీహెచ్ తదితరులు బయలు దేరి వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment