భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి మండల పూజ
సాక్షి బళ్లారి: నగరంలోని రేడియో పార్కులో ఆదివారం అయ్యప్పస్వామి మండల పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్పొరేటర్ గోవిందురాజులు స్వగృహంలో అయ్యప్పస్వామి, వినాయకుడి, కుమారస్వామి విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. భక్తులు తరలి వచ్చి అయ్యప్పస్వామి పూజలో పాల్గొని అన్న ప్రసాదాలను స్వీకరించారు. కొప్పళ జిల్లా గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధన్‌రెడ్డి సతీమణి గాలి లక్ష్మిఅరుణ, ప్రముఖులు బీవీ. శ్రీనివాస్‌రెడ్డి, మేయర్, కార్పొరేటర్లు, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
బళ్లారిఅర్బన్: నగరంలోని పటేల్‌నగర్ దుర్గా కాలనీ సన్నదుర్గమ్మ దేవస్థాన ప్రాంగణంలో ఆదివారం గురుస్వాములు సత్యనారాయణ, వి.రమేష్ నేతృత్వంలో శబరి అయ్యప్ప పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మాలధారులు భక్తి గీతాలను ఆలపించి 18 పెట్ల పడిపూజ ఆచరించి, మహా మంగళహారతి అనంతరం అన్నదానం చేశారు. శ్రీశైల దేవస్థాన నుంచి శ్రీశ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున కల్యాణోత్సవాన్ని సాయంత్రం 4 గంటల నుంచి భక్తుల సమక్షంలో నిర్వహించినట్లు దుర్గాదేవి ట్రస్ట్ అధ్యక్షుడు మీనాళ్లి తాయణ్ణ తెలిపారు. శ్రీశైలం నుంచి తెప్పించిన రథాన్ని ఊరేగించి, పల్లకీ మహోత్సవం నిర్వహించారు. అంతకు ముందు చిన్నదుర్గమ్మ దేవికి అర్ధనారేశ్వరి అలంకరణ పూజలను అర్చకులు సంతోష్ స్వామి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment