ధ్యానంతో ఆరోగ్యం కాపాడుకోండి
బళ్లారిఅర్బన్: ధ్యానం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని మాస్టర్ అయ్యప్ప పేర్కొన్నారు. బళ్లారిలోని వీరశైవ కళాశాల మైదానంలో టీఎస్‌ఎస్‌ఎం, పిరమిడ్ వరల్డ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బళ్లారి మహిళ సదా జ్ఞానయజ్ఞ కార్యక్రమాన్ని మెడిటేషన్ కోర్సు, అయ్యప్ప పిండి నిర్వహించారు. ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి దాదాపు 5 వేలమంది ధ్యానప్రియులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధ్యానం నిర్వహించి మానవ జీవన నడవడికపై మాస్టర్ అయ్యప్ప వివరించారు. రోజూ కనీసం గంటపాటు ధ్యానం చేయాలన్నారు. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలన్నారు. మాంసం, మద్యం తీసుకుంటే రోజురోజుకూ ఆరోగ్యం కోల్పోతారన్నారు. ప్రతి ఒక్కరు శాకాహారులుగా మారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ప్రతి ఇంటి పైకప్పుపై పిరమిడ్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇక్కడి మాదిరే బాగళకోట జిల్లా ఆనెగుంది తాలూకా కూడలసంగమ మంటపంలో ఈ నెల 17 నుంచి 19 వరకు మూడు రోజులపాటు చేస్తామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ధ్యాన పిరమిడ్ మాస్టర్లు నాగిరెడ్డి, రుద్రరెడ్డి, చేతప్ప, బెంగళూరు భాస్కర్‌రెడ్డి, రుద్రయ్య చౌదరి, గీతయాదవ్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment