పొగమంచు.. తీసింది ఉసురు
తుమకూరు: ద్విచక్ర వాహనం వేగంగా వచ్చిట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. బైక్ ట్రాలీని గుద్ది అలాగే చిక్కుకుపోయింది, ముగ్గురు యువకులు తీవ్ర గాయాలతో మరణించారు. ఈ దుర్ఘటన తుమకూరు తాలూకాలోని కోరా పోలీసు స్టేషన్ పరిధిలోని ఓబళాపుర గేట్ వద్ద మంగళవారం జరిగింది. మృతులను మధుగిరి తాలూకా గొందిహళ్లి నివాసులైన మహిళ ముంతాజ్ (38), షాకీర్ హుసేన్ (48), మహ్మద్ ఆసీఫ్ (12)లుగా గుర్తించారు. ద్విచక్రవాహనంలో ముగ్గురూ పని మీద వెళుతుండగా ముందు వెళుతున్న ట్రాక్టర్‌ను పొగమంచులో గమనించకుండా ఢీకొన్నారు. అందరూ అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదానికి సాక్ష్యంగా బైక్ ట్రాలీ కింద చిక్కి అలాగే ఉండిపోయింది. సమాచారం తెలియగానే జిల్లా ఎస్పీ కేవీ అశోక్, డీఎస్పీ చంద్రశేఖర్, గ్రామీణ సీఐ పుట్టేగౌడ పోలీసులు చేరుకుని పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టారు.
ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొని..
యశవంతపుర, బెంగళూరులో రోడ్డు దాటుతుండగా ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఖానాపురకు చెందిన వ్యక్తి మృతి చెందాడు. సోమవారం రాత్రి 7:15 గంటలకు మెజెస్టిక్ రోడ్డు దాటుతున్న భూషణ పాటిల్ (30) అనే వ్యక్తిని బస్సు ఢీకొంది. తీవ్రగాయాలతో అతడు మరణించాడు. చామరాజపేట ట్రాఫిక్ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.
ట్రాక్టర్‌ను బైక్ వెనుక నుంచి ఢీ
ముగ్గురు దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment