లొంగిపోతాం.. స్వాభిమానంతో జీవిస్తాం
బనశంకరి: కర్ణాటకతో పాటు కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు మోస్ట్‌వాటెండ్‌గా ఉన్న ఆరుమంది నక్సలైట్లు చిక్కమగళూరు జిల్లా ఎస్పీ, కలెక్టర్ ముందు లొంగిపోవాలని నిర్ణయించారు. ప్రభుత్వ సూచనమేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. చిక్కమగళూరు జిల్లావాసులు ముండగారు లతా, వనజాక్షి, దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన సుందరి, కేరళవాసి జీశ, తమిళనాడు వసంత కే.అలియాస్ రమేశ్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మారప్ప ఆరోలి లొంగిపోనున్నట్లు సమాచారం. తమకు ఉపాధి కల్పించాలని, తప్పుడు కేసులను ఎత్తివేయాలని, నక్సల్ నేత విక్రమ్‌గౌడ ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్లు చేశారు. వీరు జన జీవనంలోకి కలిసిపోతే రాష్ట్రంలో నక్సలైట్ ఉద్యమం కనుమరుగైనట్లేనని భావిస్తున్నారు.
నక్సల్స్ లేఖలో డిమాండ్లు
లొంగుబాటు గురించి ఆరుమంది నక్సల్స్ లేఖను విడుదల చేశారు. మేము పూర్తి సమ్మతితో కర్ణాటక, కేరళ, తమిళనాడు ప్రభుత్వాలకు రాస్తున్నామని తెలిపారు. దేశంలో నేడు మారిన పరిస్థితులు, మారుతున్న పోరాట దృక్పథం, సమాజం అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఆయుధ పోరాటాన్ని వీడి ప్రజాజీవితంలో రావడం ఉత్తమమని భావిస్తున్నట్లు తెలిపారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి నుంచి స్పష్టత కోరుతున్నామని లేఖలో పేర్కొన్నారు. తమ ఆత్మగౌరవానికి భంగం కలగకుండా చూడాలన్నారు. లొంగిపోయాక ప్రజా జీవిత పోరాటంలో చేపట్టే కార్యకలాపాలకు ఎలాంటి అడ్డంకులు ఉండరాదని, తమ జీవితాన్ని ప్రజలకోసం ధారపోస్తామని తెలిపారు. తుపాకీ వీడి బయటికి వచ్చి జైలులో కూర్చునే పరిస్థితి ఉండకూడదని అన్నారు. ఇప్పటికే ప్రజా జీవితంలోకి వచ్చిన పలువురి బతుకు దుర్భరంగా మారిందని, కాబట్టి తమకు ఆర్థిక సాయం అందించాలని కోరారు.
ఎలాంటి ఆటంకాలు కల్పించరాదు
సర్కారుకు 6 మంది నక్సలైట్ల లేఖ
నేడు చిక్కమగళూరులో లొంగుబాటు?
Comments
Please login to add a commentAdd a comment