నీరు, బోరు స్కీంలో భారీ స్కాం!
బనశంకరి: బృహత్ బెంగళూరు మహానగర పాలికెలో 2016లో బోర్‌వెల్స్ తవ్వకాలు, తాగునీటి ఆర్‌ఓ ప్లాంట్ల పథకంలో కుంభకోణానికి సంబంధించి ఈడీ దాడులు చేపట్టింది. మంగళవారం బీబీఎంపీ కేంద్ర కార్యాలయంలో చీఫ్ ఇంజనీర్ ప్రహ్లాద్‌రావ్ ఆఫీసులో 7 మంది ఈడీ అధికారులు ఆకస్మిక సోదాలు జరిపి ముఖ్యమైన ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రహ్లాద్‌ను విచారించారు.
రూ. 400 కోట్ల స్వాహా అని ఫిర్యాదులు
ప్రజలకు తాగునీటి వసతి కింద బెంగళూరు నగరంలో బీబీఎంపీ ఆధ్వర్యంలో రూ.969 కోట్ల వ్యయంతో 9,588 బోరుబావులు తవ్వి, 976 వాటర్‌ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. కానీ ఇందులో రూ.400 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని బీజేపీ నేత ఎన్‌ఆర్.రమేశ్ 2019లో ఆధారాలతో ఏసీబీకి ఫిర్యాదు చేశారు. 2016 నుంచి 2018 వరకు కమిషనర్, 5 మంది జాయింట్ కమిషనర్లు, 5 మంది ఇంజినీర్లతో పాటు 40 మందికి పైగా అధికారుల పాత్ర ఉందని ఫిర్యాదు చేశారు. తరువాత ఈ కేసు దర్యాప్తును ఈడీకి అప్పగించారు. ఆ సమయంలో ఎవరెవరు పని చేశారనేది ఈడీ సిబ్బంది ఆరా తీశారు. పాలికె చీఫ్ అకౌంటెంట్ ను ప్రశ్నించారు. బీబీఎంపీ కాంట్రాక్టర్ల సంఘం ఉపాధ్యక్షుడు అంబికాపతి ఇంట్లో గతంలో పెద్దమొత్తంలో లభించిన నగదు గురించి దర్యాప్తు చేపట్టారు. ఈడీ రైడ్లతో అధికారుల్లో గుబులు నెలకొంది.
బీబీఎంపీ ఆఫీసులో
ఈడీ ఆకస్మిక సోదాలు
చీఫ్ ఇంజనీర్‌కు ప్రశ్నలు
అధికారుల్లో గుబులు
రూ. 969 కోట్ల పథకంపై నీలినీడ
Comments
Please login to add a commentAdd a comment