మార్కెట్ కొనసాగించాలని రాస్తారోకో
రాయచూరు రూరల్: నగరంలో కూరగాయల మార్కెట్ తరలింపు తగదని వివిధ సంఘాల కార్యకర్తలు డిమాండ్ చేశారు. బుధవారం రాయచూరు సిటీ కార్పొరేషన్ వద్ద ఆందోళన చేపట్టిన శరణప్ప, రాజు, రవీంద్ర జాలదార్, శివకుమార్ యాదవ్ మాట్లాడారు. కోవిడ్ సమయంలో ఆయా ప్రాంతాల ప్రజలకు అనుకూలమయ్యే విధంగా రూపొందించిన మార్కెట్లను అదే విధంగా కొనసాగిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. రెండు గంటల పాటు తహసీల్దార్ కార్యాలయం నుంచి జిల్లాధికారి కార్యాలయం వరకు రాస్తారోకో జరిపారు. శశిమహల్ థియేటర్ వద్ద ఉన్న మార్కెట్‌ను యథాప్రకారం కొనసాగించాలని కోరుతూ కార్పొరేషన్ మేయర్ నరసమ్మ, కమిషనర్ గురుసిద్దయ్యలకు వినతిపత్రం సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment