![మెట్రో రైలు.. చార్జీల బాదుడు చాలు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/photo_mr-1739128217-0.jpg.webp?itok=RuJ_EDCy)
మెట్రో రైలు.. చార్జీల బాదుడు చాలు
శివాజీనగర: క్రమ తప్పకుండా నిత్యావసరాల ధరలు, సేవల చార్జీలను పెంచడం వల్ల బెంగళూరులో జనం జీవన వ్యయం ఆకాశాన్ని అంటుతోంది. త్వరగా గమ్యం చేరడానికి ఆసరాగా ఉన్న మెట్రో రైళ్ల చార్జీలను కూడా హెచ్చించడంపై అన్ని వర్గాల్లో విపరీతమైన ఆగ్రహం వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో ప్రయాణికులు తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. పెంపును తక్షణం వాపస్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
రాయితీల్లోనూ కోత
ఆదివారం నుంచే కొత్త మెట్రో చార్జీలు అమలులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఈ చార్జీలను పెంచడం లేదు అని ఐటీ సిటీకి చెందిన ఓ ఎంపీ ఇటీవల చేసిన ప్రకటన ఉత్తుత్తిగా తేలిపోయింది. దీంతో ప్రయాణికుల జేబుకి కత్తెర పడనుంది. ప్రతి 2 కి.మీ.కి కనీసం రూ.10 ధర నిర్ధారించడమైనది. ప్రస్తుత ప్రయాణ చార్జి కనీసం రూ.10 నుండి గరిష్టంగా రూ. 60 వరకు ఉండేది. కొత్త చార్జీల వల్ల గరిష్ట ధర రూ.90 కి చేరిందని ప్రయాణికులు మండిపడుతున్నారు. స్మార్ట్ కార్డులపై లభిస్తున్న రాయితీలను కూడా మెట్రో కుదించింది. ఇకపై 5 శాతం రాయితీనే ఉంటుంది. బెంగళూరు మెట్రో చార్జీలు ఢిల్లీ మెట్రోను మించిపోయినట్లు నెటిజన్లు దుయ్యబట్టారు.
బీజేపీ ఆగ్రహం
మెట్రో చార్జీల పెంపుపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సుమారు 46 శాతం పెంచడం సబబు కాదని, ప్రజలపై తీవ్ర భారం మోపడమేనని, సామాన్య ప్రజల గాయంపై మరో గాయం చేసిందని బీజేపీ పక్ష నేత ఆర్.అశోక్ ఆరోపించారు. సొంత వాహనాలకు బదులు ప్రజా రవాణాను ప్రోత్సహించి బెంగళూరు పర్యావరణానికి మంచి చేయాల్సిన ప్రబుత్వం.. ప్రజలను మెట్రో నుండి దూరం చేస్తున్నట్లు ఉందని విమర్శించారు.
పెంపుపై ప్రయాణికుల ఆగ్రహం
సోషల్ మీడియాలో విమర్శలు
Comments
Please login to add a commentAdd a comment