![అర్ధర](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09bng15-120023_mr-1739128217-0.jpg.webp?itok=R6UqJgZC)
అర్ధరాత్రి.. మంటల్లో బస్సు
మండ్య: బెంగళూరు నుంచి మైసూరు మీదుగా కేరళకు వెళుతున్న లగ్జరీ ట్రావెల్స్ బస్సులో మంటలు లేచి కాలిపోయింది. అదృష్టవశాత్తు ప్రయాణికులు బస్సులో నుంచి దిగి ప్రాణాలను కాపాడుకున్నారు. ఈ సంఘటన శనివారం అర్ధరాత్రి మండ్య దగ్గర హోసబూదనూరు వద్ద హైవేలో మీద జరిగింది. బెంగళూరు నుంచి అశోకా ట్రావెల్స్ బస్సు కేరళలోని కణ్నూరుకు బయల్దేరింది. ఘటనాస్థలి వద్ద రోడ్డు డివైడర్‌కు బస్సు ఢీకొట్టింది. దీంతో టైరు పేలి ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. వెంటనే డ్రైవర్ బస్సును నిలిపి గట్టిగా కేకలు వేసి ప్రయాణికులను నిద్ర లేపాడు. అందరూ గబగబా దిగిపోయారు. కొంతసేపటికే పూర్తిగా మంటలు వ్యాపించి బస్సు మొత్తం కాలిపోయింది. లగేజీని తీసుకునే సమయం లేకపోవడంతో బస్సులోనే ఆహుతైంది. బట్టలు, విలువైన వస్తు సామగ్రి దగ్ధమైందని బాధితులు వాపోయారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. మండ్య గ్రామీణ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. అర్ధరాత్రి నుంచి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం వేరే బస్సుల్లో ఊళ్లకు బయల్దేరారు.
మండ్య వద్ద ట్రావెల్స్ బస్సు దగ్ధం
ప్రయాణికులు సురక్షితం
![అర్ధరాత్రి.. మంటల్లో బస్సు1](https://www.sakshi.com/gallery_images/2025/02/10/09bng15a-120023_mr-1739128218-1.jpg)
అర్ధరాత్రి.. మంటల్లో బస్సు
Comments
Please login to add a commentAdd a comment