![పోలీస](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09bng23-120014_mr-1739128218-0.jpg.webp?itok=qExH3yPd)
పోలీసులకు పురుగుల భోజనం
దొడ్డబళ్లాపురం: యలహంక సమీపంలోని వైమానిక స్థావరంలో ఏరో ఇండియా భద్రత కోసం వందల సంఖ్యలో పోలీసులను నియమించారు. ఆదివారం మధ్యాహ్నం పోలీసులకు యలహంక ఠాణా సిబ్బంది ఆహారాన్ని పంపిణీ చేశారు. కానీ అందులో బొద్దింకలు ,పురుగులు కనిపించడంతో చాలామంది పోలీసులు తినకుండా పడేశారు. పోలీసులకు నాణ్యత కలిగిన ఆహారం ఇవ్వాలని డీజీపీ ఆఫీసు నుంచి ఆదేశాలు వచ్చినా నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఇంకా ఐదురోజులు వేలాది పోలీసులు అక్కడే ఉంటారు. సరైన ఆహారం ఇవ్వకుంటే ఎలాగని అసంతృప్తిని వ్యక్తంచేశారు.
జాతర్లలో కార్లు మాయం
● మరాఠా ముఠా అరెస్టు
యశవంతపుర: ఆ ముఠా సభ్యులు జాతరలకు వెళ్తారు. కానీ దైవ దర్శనం కోసం కాదు, కార్లను ఎత్తుకెళ్లడానికి. రథోత్సవాలు, జాతరల్లో కార్లను చోరీ చేస్తున్న మరాఠా ముఠాను కలబురగి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర బీడ్ జిల్లా పూణె చెందిన విఠల సకారామ లస్కరె (38), అనుచరులు గైక్వాడ్ ఏకనాథ వాడి, సహదేవ తాందళె ఏకనాథవాడి, సునీల్ బీడ్, రాజు గైక్వాడ్‌లను అరెస్ట్ చేసినట్లు కలబురగి ఎస్పీ అడ్డూరు శ్రీనివాసులు తెలిపారు. నిందితులు జనవరి 30న చిత్తాపుర తాలూకా నాలవాగ కోరి సిద్దేశ్వర జాతరలో దత్తు గుత్తేదార కారును చోరీ చేసి నంబర్ ప్లేటును మార్చి ఆళంద మీదుగా మహారాష్ట్రకు తరలించారు. నిందితులు గతంలో బాదామి బనశంకరి జాతర, ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు జాతరలో కార్లను మాయం చేసినట్లు ఒప్పుకున్నారు. ఎత్తుకెళ్లిన కార్లకు నంబర్ పేట్లు మార్చి వాటిని గంజాయి రవాణాకు ఉపయోగించేవారు. జాతర్లకు కార్లలో వెళ్లేవారు పటిష్టమైన లాక్‌లను ఉపయోగించాలని ఎస్పీ సూచించారు.
మహాలక్ష్మీ నమోస్తుతే
మండ్య: మండ్య తాలూకాలోని కిక్కేరి దగ్గర ఉన్న చోళమారనహళ్ళి గ్రామంలో కొత్తగా నిర్మించిన లక్ష్మీ దేవి ఆలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఆదివారం ఉదయం నుంచి అర్చకులు హోమ పూజలు నిర్వహించారు. గణపతి హోమం, నవగ్రహల పూజలు , శాంతిహోమం నిర్వహించారు. పెద్దసంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
![పోలీసులకు పురుగుల భోజనం 1](https://www.sakshi.com/gallery_images/2025/02/10/09bng43-120023_mr-1739128218-1.jpg)
పోలీసులకు పురుగుల భోజనం
Comments
Please login to add a commentAdd a comment