సెలవు రోజు. జలసమాధి
బొమ్మనహళ్లి: సెలవు రోజున సరదా విహారానికని వెళ్లిన యువకులు జలసమాధి అయ్యారు. బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్ తాలూకాలో ఉన్న బన్నేరుఘట్ట సమీపంలో ఉన్న సువర్ణముఖి కోనేరులో ఇద్దరు యువకులు నీటమునిగి మరణించారు. బొమ్మనహళ్ళి గారెబావిపాళ్యలో హెబ్బగోడిలోని ఎస్‌ఎఫ్‌ఎస్ కాలేజీలో చదివే దీపు (20), యోగీశ్వరన్ (20) మృతులు.
కోనేరు మధ్యలోకి వెళ్లాక
వివరాలు.. ఆదివారం కావడంతో ఐదుమంది స్నేహితులు కలిసి ఈతకొట్టేందుకు వెళ్లారు. ఈత కొడుతూ కోనేరు మధ్యలోకి వెళ్లారు. యోగీశ్వరన్‌కు పెద్దగా ఈత రాకపోవడంతో మునిగిపోతూ కేకలు వేశాడు. స్నేహితులు అతన్ని కాపాడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో దీపు అతన్ని బయటకు తీసుకురావాలని ప్రయత్నించినా వీలు కాలేదు. ఒకరినొకరు గట్టిగా పట్టుకోవడంతో నీట మునిగి చనిపోయారు. మిగతా ముగ్గురు క్షేమంగా బయటపడ్డారు. బన్నేరుఘట్ట పోలీసులకు సమాచారం ఇవ్వగా వారితో పాటు ఫైర్ సిబ్బంది చేరుకుని కోనేరులో గాలించి ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. స్థానిక ఆస్పత్రి మార్చురీకి తరలించి కుటుంబాలకు సమాచారం అందించారు.
కోనేరులో మునిగి ఇద్దరు యువకుల మృతి
ఆనేకల్ వద్ద దుర్ఘటన
సెలవు రోజు. జలసమాధి
Comments
Please login to add a commentAdd a comment