పదే పదే సర్వర్ డౌన్
ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు సర్వర్‌డౌన్ సమస్య రిజిస్ట్రేషన్, ముద్రణ శాఖకు తలనొప్పిగా మారింది. మూడు నాలుగు శాఖల సాంకేతికత పై రిజిస్ట్రేషన్ శాఖ ఆధారపడటంతో ఈ సమస్య ఏర్పడింది. సర్వర్ సమస్యతో ఆస్తి రిజిస్ట్రేషన్‌కు ప్రజలు తంటాలు పడుతున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొర్రీలు ఎక్కువైనట్లు విమర్శలున్నాయి. రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, నగరాభివృద్ధి శాఖల సాంకేతికత రిజిస్ట్రేషన్, ముద్రణ శాఖపై ఆధార పడింది. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏదో ఒక శాఖలో లోపం ఏర్పడినా రిజిస్ట్రేషన్ నిలిచిపోతుంది. ఇదే కారణంతో పలురోజులుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆపసోపాలు పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment