![సమావేశమైన మున్నూరుకాపు సంఘం ప్రతినిదులు - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/21/20ckm431-191044_mr_0.jpg.webp?itok=s9vIIlCY)
సమావేశమైన మున్నూరుకాపు సంఘం ప్రతినిదులు
ఖమ్మంమామిళ్లగూడెం: మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఈ నెల 23న నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు పారా నాగేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ, పొన్నం వెంకటేశ్వర్లు తెలిపారు. ఖమ్మం బుర్హాన్‌పురంలో సోమవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు.. మున్నూరుకాపుల సంక్షేమం, ఉన్నతికి చేయూతనిచ్చిన కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడమేకాక మంత్రి పువ్వాడ అజయ్ విజయాన్ని కాంక్షిస్తూ ఈ సమ్మేళనం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాజ్యభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర హాజరై మాట్లాడనున్నందున మున్నూరుకాపు కులస్తులు అధికసంఖ్యలో హాజరుకావాలని కోరారు. సమావేశంలో కార్పొరేటర్లు తోట వీరభద్రం, మాటేటి నాగేశ్వరరావు, మడూరి ప్రసాద్‌తో పాటు జి.శ్రీనివాస్, హరిప్రసాద్, గుండ్లపల్లి శేషగిరిరావు, పగడాల నరేందర్, శెట్టి భాస్కరరావు, కుమ్మరికుంట్ల వెంకటనారాయణ, రాపర్తి రాజా, గోలెపు గణేశ్, నానబాల హరీశ్, కె.ఉప్పలయ్య, ఆకుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment